- దమహిళల కోసం రూ.3 లక్షల కోట్ల కేటాయింపు
- దకనీస మద్దతు ధర కోసం రూ.2 లక్షలు కోట్లు
- దకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
- దమోదీ 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ను వెల్లడిరచిన సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇచ్చిన హామీలతోపాటు ప్రజా సంక్షేమం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసేదిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘‘మహిళల కోసం రూ.3 లక్షల కోట్లు, కనీస మద్దతు ధర కోసం రూ.2 లక్షలు కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ముద్రా రుణపరిమితిని పెంచామని, రూ.5.36 లక్షల కోట్లతో 3 కోట్ల ఇండ్ల ను నిర్మించనున్నామనితెలిపారు. 75 వేల మెడికల్ సీట్లను అదనంగా మంజూరు చేశామని చెప్పారు. మూలధన వ్యయం కింద మౌలిక సౌకర్యాల కల్పనుకు రూ.11 లక్షల 11 వేల కోట్లు కేటాయించామన్నారు. బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ ఛార్జీలను తగ్గించామని ఇవన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే.’’అని వివరించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలైందని, 6 గ్యారంటీలను కూడా ఎందుకు అమలు చేయలేకపోయిందని ప్రశ్నించారు.
మోదీ 100 రోజులపాటు రైతులు, యువత, మహిళలుసహా అన్ని వర్గాల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. పీఎం కిసాన్ నిధి ద్వారా 9 కోట్ల 30 లక్షల మంది ఖాతాల్లో 20 వేల కోట్లు జమ చేశామని తెలిపారు. మహిళల కోసం….‘నారీ శక్తి’ పేఎంఏవై కింద 3 లక్షల కోట్లు, 2 లక్షల 35 వేల మంది స్వయం సంఘాలకు చెందిన 26 లక్షల మంది మహిళలను ఆదుకునేందుకు 5 వేల కోట్ల విలువైన బ్యాంకు రుణాలు మంజూరు చేశామనితెలిపారు. ముద్రా రుణాల పరిమితిని 10 లక్షల నుండి రూ.20 లక్షలకు పెంచామని వివరించారు. వెయ్యి ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి 20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగ, ఉపాధి కల్పించాలని ప్రణాళిక రూపొందించామని తెలిపారు. సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 5 లక్షల వరకు ఆరోగ్య కవరేజ్ అందిస్తున్నట్లు చెప్పారు. 3 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాజెక్టులను రూపొందించినట్లు తెలిపారు. న్యాయంపై దృష్టి సారించి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు ప్రవేశపెట్టడంతోపాటు పేపర్ లీక్‌లను నివారించేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ ను అమలు చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి బండ సంజయ్ తెలిపారు.