- జాతీయజెండా ఆవిష్కరించిన మంత్రులు
- అసెంబ్లీ ప్రాంగణంలో జెండా ఆవిష్కరించిన గుత్తా, పోచారం
- సిద్దిపేటలో హరీష్ రావు, సిరిసిల్లలో కెటిఆర్ జెండా ఆవిష్కరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 2 : రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పబ్లిక్ గార్డెన్స్ సిఎం కెసిఆర్ పతాకావిష్కరణ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అసెంబ్లీ ఆవరణలో ఘనంగా జరిగాయి. శాసన మండలి ప్రాంగణంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శేరి శుభాష్ రెడ్డి, రఘోత్తమ రెడ్డి, వి.గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్, ఎల్. రమణ, దండే విఠల్, అసెంబ్లీ కార్యదర్శి చార్యులు, టిఆర్‌ఎస్‌ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో మంత్రి హరీశ్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద అమర వీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర 8వ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌లో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన వేడుకల్లో అసెబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిశారు. వికారాబాద్ జిల్లా కేంద్రం లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు జాతీయ జెండా ఎగుర వేశారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన వేడుకలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజయ్యారు. కలక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముదు చిన్న శంకరంపేటలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిచారు. వరంగల్ కోటలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు ల గౌరవ వందనం స్వీకరించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాకేంద్రంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జాతీయ జెండా ను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. పెరేడ్ మైదానంలో జరిగిన ఉత్సవా లకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్క రించిన అనంతరం జిల్లా ప్రగతి నివేదికను ప్రజల ముందుంచారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సంగరెడ్డి కలెక్టరేట్‌లో హోమ్ మంత్రి మహమూద్ అలీ జాతీయ జెండా ఎగుర వేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకలకు మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టరేట్‌లో జాతీయ పతాకావిష్కరించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను ప్రజలముందుంచారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్చించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.