Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాదు…రాక్షస పాలన సాగింది

  • కాంగ్రెస్‌ ‌పథకాలను టిఆర్‌ఎస్‌ ‌పేరు మార్చి ప్రవేశపెట్టింది
  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేంసాగర్‌రావు

మంచిర్యాల, (‌ప్రజాతంత్రప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన ప్రజాస్వామ్య బద్దంగా పాలన కొనసాగలేదని, రాక్షాస పాలన తలపించే విధంగా పరిపాలించారని తెలంగాణ రాష్ట్ర సమితిపై మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ధ్వజమెత్తారు. గురువారం మంచిర్యాల పట్టణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ముందుగా ఈ సభకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌భట్టి విక్రమార్క, సినీనటి విజయశాంతితో పాటు కాంగ్రెస్‌ ‌పార్టీ అధినాయకులు వస్తున్నారని ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఉదయం 11గంటలకు సభ ప్రారంభం కాగా మధ్యాహ్నం 1:30గంటలు దాటినా అధినాయకులు రాకపోవడంతో ప్రేంసాగర్‌రావు సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సభకు పార్టీ సీనియర్‌ ‌నాయకులు కేవీ.ప్రతాప్‌ అధ్యక్షత వహించారు. ఈ సభకు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వేలాది సంఖ్యలో ప్రజలు, కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకలు, కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం ప్రేంసాగర్‌రావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ‌తాజామాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు చేతకాని తనం వల్లే నియోజకవర్గం అభివృద్దిలో వెనుకబడిందని విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులోని 10టీఎంసీల నీరు నియోజకవర్గానికి అందించాల్సి ఉండగా, ఇక్కడి నీటిని హైదరాబాద్‌ ‌లాంటి నగరాలకు తరలించడంలో దివాకర్‌రావు పాత్ర కీలకమైందని, అందుకే హైదరాబాద్‌ ‌లాంటి నగరాల్లో నడిపెల్లి దివాకర్‌రా వును ఎల్లంపల్లి దివాకర్‌రావు అని సంబోధిస్తారని ఎద్దేవా చేశారు. నియోజ• •వర్గానికి గత మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి చేయలేని అభివృద్దిని జరుగబోయే ఎన్నికల్లో మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ది చేస్తానడం విడ్డూరంగా ఉందని, నియోజకవర్గ ప్రజలు ఆయన చేసిన అభివృద్ది ఏమిటో గమనిస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో కమీషన్లకు కక్కుర్తిపడి అభివృద్దిని కుంటుపడే విధంగా చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ అధికారం చేపట్టగానే ఇచ్చిన హామీలు విస్మరించారని, ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ముందస్తు ఎన్నికలు తీసుకవచ్చారని విమర్శించారు.

మంచిర్యాల మున్సిపాలిటిలో అవినీతి రాజ్యమేలిందని, స్థానిక ప్రజలకు తాగునీరు అందించడంలో వైఫల్యం చెందారని ఆరోపించారు. నిరుపేదలకు రెండు పడక గదుల ఇండ్లు ఇస్తామని ఏ ఒక్కరికి ఇచ్చిన దాఖాలాలు లేవన్నారు. సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి అవినీతికే పట్టం కట్టారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటు పడుతుందని అన్నారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు చేయలేదని, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసే పార్టీ కాంగ్రెస్‌ ‌పార్టీ అని అన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన పార్టీ టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ‌పార్టీ సంక్షేమ పథకాలనే టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పేరు మార్చి ప్రవేశపెట్టిందని అన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. నియోజకవర్గం లో గతంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇచ్చిన పట్టాలు రద్దు కాలేదని, గెలిచిన వెంటనే వారందరికి ఇండ్ల పట్టాలతో పాటు ఇంటి నిర్మాణానికి 5లక్షల రూపాయలను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అనునిత్యం తాగునీరు అందిస్తానని, లేనియెడల రాజకీయాల నుంచి తప్పుకుంటానని పేర్కొన్నారు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ ‌విసిరారు. నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో జరుగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజా ర్టీ అందించాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతరం చెన్నూర్‌ ‌నియోజకవర్గం భీమారం మండలానికి చెందిన సుమారు వందమంది నాయకలు, కార్యకర్తలు కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. వీరికి ప్రేంసాగర్‌రావు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్‌ ‌నియోజకవర్గ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్‌నేత, ఐఎన్‌టీయూసీ నేత జనక్‌‌ప్రసాద్‌, ‌హెచ్‌ఎంఎస్‌ ‌నాయకులు, ప్రజాకూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!