హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 28 : రాగయే మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రెండు, మూడు రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని, ఇదే సమయంలో అరేబియన్ సముద్రం, లక్షద్వీప్‌లోని పలు ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. ఇక రాష్ట్రంలోకి• జూన్ 5 నుంచి 10వ తేదీ మధ్యలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.