మునుగోడులో మునిగేది ‘లెఫ్ట్ ‌పార్టీలే ..!

దేశంలో కాంగ్రెస్‌కు అంతో ఇంతో ప్రజాదరణ ఉన్నా..కమ్యూనిస్టులకు ఆ మాత్రం ఆదరణ కూడా లేదు. పిడివాదం, పడికట్టు పదాలతో వారు చేస్తున్న పోరాటాలు ప్రజలను మెప్పించలేక పోతున్నాయి. అలాగే మునుపటిలా పోరాటాలు చేయడం లేదు. సమస్యలపై ఉద్యమించడం లేదు. ఉన్న ఒకరిద్దరు నేతలు తమ ఉనికిని చాటుకునే యత్నాల్లో ఉన్నారు. ఎప్పటికి ఏది అవసరమో అది చేద్దాం అన్న ధోరణిలో ఉన్నారు. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో మమతా బెనర్జీ ప్రతిపాదించిన యశ్వంత్‌ ‌సిన్హాకు మద్దతు ఇచ్చారే తప్ప గిరిజన మహిళ అయిన ద్రౌది ముర్ముకు మద్దతు ఇవ్వలేదు. ఇంతకన్నా దిగజారుడు ఉండబోదు. కేవలం బిజెపిని వ్యతిరేకించాలన్న కక్షతో ద్రౌపది ముర్మును వ్యతిరేకించారు. తమ బద్ద శతృవైన మమతా బెనర్జీతో చేతులు కలిపారు. ఆమె చెప్పినట్లు తలూపారు. ఇదీ నేటి కమ్యూనిస్టుల సిద్దాంతం. ఇకపోతే తెలుగు రాష్టాల్రను తీసుకుంటే గట్టిగా సమస్యలపై పోరాటాల ద్వారా ప్రజలను కదిలించలేక పోతున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కూడా టిఆర్‌ఎస్‌ ‌పిలుపు ఆలస్యం పోయి చంకనెక్కారు. మతోన్మాద శక్తులను ఓడించాలని నిర్ణయించి మద్దతు ఇచ్చామని సిపిఐ, సిపిఎంలు ప్రకటించుకున్నాయి. ఇంతకన్నా దౌర్బాగ్యం మరోటి లేదు. పోటీ చేయడమో లేకపోతే గమ్మున ఉండడమో చేయకుండా గడీల పాలన అంటూ విమర్శించిన కెసిఆర్‌కు మద్దతు ప్రకటించడం వెనక మతలబు లేదని అనుకోలేం. ఏం ఆశించి ఈ నిర్ణయం తీసుకున్నారో ప్రజలు కూడా లెక్కలు వేసుకుంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో రానున్న ఉప ఎన్నికలు సామాన్య ప్రజలకు, పెట్టుబడిదారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొనడం ద్వారా తమ దిగజారుడు తనాన్ని చాటుకున్నారు.

ఈ ఎన్నికలో బీజేపీ మతోన్మాద శక్తులను ఓడించాలని కార్యకర్తలకు, ప్రజలకు పిలుపు నిచ్చారు. దేశంలో మోదీ ప్రభుత్వం నిరుపేదలపై పెనుభారం మోపుతుందని, నిత్యావసర సరుకులు మొదలుకొని పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌గ్యాస్‌ ‌ధరల వరకు విపరీతంగా పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని వాదిస్తున్నారు. పోనీ మోదీ•కి వ్యతిరేకంగా బలమైన పోరాటాలు చేశారా అంటే అదీ లేదు. రానున్న ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించి మోదీ ప్రభుత్వానికి తగి న బుద్ధి చెప్పాలని అంటున్న వారు.. మునుగోడుతో ఇది సాధ్యమా అన్నది ఆలోచించడం లేదు. అలాగే కెసిఆర్‌ ‌గడీల పాలన అన్న వారు ఆయనతో ఎందుకు జత కట్టారో చెప్పడం లేదు. ఇకపోతే ఇప్పటికే సిపిఐ మనుగోడులో టిఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వగా, సీపీఎం మునుగోడు ఉపఎన్నికలో ఏ పార్టీతో పొత్తుకు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. స్వాతంత్య్ర పోరాట చరిత్ర, తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తుందని ఆరోపించినంత మాత్రాన ప్రజలు నిజాలు తెలుసుకోలేకుండా ఉండరు. నిజానికి దేశ చరిత్రను వక్రీకరించిన వారిలో కమ్యూనిస్టులు ముందుంటారు. ఇలా సిద్దాంతం లేకుండా వారి రాజకీయ గమ్యం సాగుతోంది. అందుకే వామపక్షాల ఐక్యత అన్నది నినాదంగా మారుతోంది. ఏళ్లుగా ఈ విషయంలో తర్జనభర్జనలే తప్ప కార్యాచరణ లేకుండా పోతోంది. కలసి పోరాడాలన్న ఆకాంక్ష ఉన్నా ముందరి కాళ్లకు బంధం పడుతోంది. ఇతర పార్టీలతో పొత్తులకు వెంపర్లాడుతున్న లెఫ్ట్ ‌నేతలు సంస్థాగతంగా బలహీనం అవుతున్నాయి. మారుతు న్న కాలానుగుణంగా సిద్ధాంతాలను మార్చుకోకపోవడం కూడా ఒక కారణంగా చూడాలి. వీరు ఎంతసేపూ మరో పార్టీకి తోకపార్టీగా మారడం మినహా గట్టిగా చేస్తున్న ప్రయత్నాలు శూన్యం. అందుకేనేమో గతంలో కమ్మూనిస్టులకు ఉన్న ప్రజాదరణ కాలక్రమేణా కనుమరుగు అవుతోంది. అయినా ఆ పార్టీల్లో ఆత్మవిమర్శ అన్నది మచ్చుకైనా కానరావడం లేదు. పోరాటాల్లో ఆరితేరిన లెఫ్ట్ ‌పార్టీలు ఎందుకనో ప్రజల్లో స్థానం సంపాదించుకోలేక పోతున్నారు. లెఫ్ట్ ‌బలహీనం కారణంగా ఇతర రాజకీయ పార్టీలు తమ స్థానాలను పదిలం చేసుకోవడంతో పాటు బలపడుతున్నాయి.

ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం అవసరం. అందుకు లెఫ్ట్ ‌పార్టీలు విభేదాలు పక్కకు పెట్టి కనీసం కూటమిగా అయినా ముందుకు సాగాలి. విలీనం కావాలన్న ఆశ ఎలాగూ నెరవేరనప్పుడు కూటమిగా ముందుకు సాగాలన్న గట్టి నిర్ణయం కూడా తీసుకోవ డం లేదు. ప్రస్తుతం దేశం క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటోందనీ.. ఈ దశలో వామపక్షాల ఐక్యత అత్యవ సరమని పలు వామపక్ష పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. భాజపా వ్యతిరేక గళాలు ఒకే తాటి దికి రావాలన్న ఆకాంక్ష బలంగా వినిపిస్తున్నా..అందుకు లెఫ్‌ ‌పార్టీలు ఆవగింజంతయినా పనిచేయడం లేదు. లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులు, మేధావులు, సిద్ధాంతకర్తలు, మైనారిటీలు, దళితులందరూ ఒకే వేదిక దకు రావడంపై తక్షణం దృష్టిపెట్టాలని భారీ మాటలు చెబుతారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చేతుల్లో కేంద్రం కీలుబొమ్మగా మారిందనీ.. మోదీ సర్కారు నిపనిచేయలేక పోతున్నారు. అయితే మతోన్మాదం విషయంలో లెఫ్ట్ ‌రెండు నాల్కల ధోరణితో ఉంది. హిందువులు ఏదైనా చేస్తే దానిని తీవ్రంగా పరిగణించి హిందూ మతోన్మాదం అన్న ముద్ర వేస్తున్నారు. ఈ జాడ్యం నుంచి వారు బయటపడక పోవడంతో హిందువుల్లో లెఫ్ట్ ‌పార్టీల పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్‌ ‌టెర్రరిజం విషయంలో కఠినంగా లెఫ్ట్ ఉం‌డలేక పోతోంది.

మతోన్మాద రాజకీయాలను భాజపా సర్కారు ప్రోత్సహిస్తోందని.. చెబుతూ హిందువులను మాత్రం ఎవరేమన్నా నోర్మూసుకుని ఉండాలన్న ధోరణిని ప్రదర్శిస్తోంది. కాశ్మీర్‌లో మత ఆందోళనలను, పాక్‌ ఉ‌గ్రవాదుల దుశ్చర్యలను,. ఐఎస్‌ ఉ‌గ్రవాదుల ఊచకోతలను తీవ్రంగా వ్యతిరేకించి ప్రజలకు అండగా నిలిచిన దాఖలాలు లేవు. ఇక లెఫ్ట్ ఐక్యత లేదా విలీనం విషయంలో సిపిఐ ఎప్పుడూ ఉదారంగా మాట్లాడుతుంటుంది. అందుకు సిపిఎం సిద్దంగా లేదు. ఈ క్రమంలో మోదీ అనుకుంటున్నట్లు కాంగ్రెస్‌ ‌ముక్త భారత్‌తో పాటే కమ్యూనిస్ట్ ‌ముక్త భారత్‌ ‌కూడా సాకారం కాబోతున్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రతిసారీ జరిగే లెఫ్ట్ ‌సమావేశాల్లో ఐక్యత, ఐక్యపోరాటల గురించి చెబుతున్నా కార్యాచ రణ అన్నది లేకపోవడం కారణంగా కమ్యూనిస్టులు ముందుకు సాగడం లేదు. అందుకే ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతున్నారు. సత్వర రాజకీయ అవసరాలపైనా చర్చించి ప్రజల్లో నమ్మకం కలిగేలా చేస్తే తప్ప లెఫ్ట్‌కు అవకాశాలు లేవనే చెప్పాలి.ఈ క్రమంలో తమ ఆలోచనలకు దగ్గరగా ఉన్న లౌకిక, ప్రజాస్వా మ్య పార్టీలతో కలిసి ఐక్య కార్యాచరణ రూపొందించాలి. వామపక్ష ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలి. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేలా లెఫ్ట్ ‌పార్టీలు ముందుకు రావాలి. కేవలం బిజెపి హిందుత్వాన్ని ప్రోత్సహింస్తోందని చెప్పడం ద్వారా మైనార్టీ ఓట్ల కోసం వెంపర్లాడే రాజకీయాలు మానాలి. సమస్యలను అజెండగా చేసుకుని పోరాడితే తప్ప ప్రజలు నమ్మరని గుర్తించాలి. ఐక్యతా నినాదాన్ని పక్కన పెట్టి కలసి పనిచేయాలన్న సంకల్పంతో ముందుకు సాగితే తప్ప ప్రజలు నమ్మరు. సమస్యపై పోరాటం ప్రాతిపదికగా కమ్యూనిస్టులు ఐక్యంగా ముందుకు సాగాలి.
– ప్రజాతంత్ర డెస్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page