మహిళను అవమానించడం, నిర్లక్ష్యం చేయడం తగునా…?

  • ఇదేనా తెలంగాణ రిచ్‌ ‌కల్చర్‌…!
  • సిఎం, మంత్రులు, సీఎస్‌ ‌తో చర్చకు రాజ్‌ ‌భవన్‌ ‌డోర్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.
  • ఓ మంత్రి నన్నేలా బిజేపి లీడర్‌ అం‌టారు?
  • మంత్రి చెప్పిందే నిజమైతే… రాజ్‌ ‌భవన్‌ ఆహ్వానానికి ఎందుకు స్పందించలేదు..?
  • రోడ్డు, ట్రైన్‌ ‌మార్గంలో ఈ నెల 10న భద్రాది టెంపులకు వెళ్తాను.
  • గవర్నర్‌ ‌కు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ట్రాన్స్ ‌పోర్ట్ ‌మోడ్‌ ఇదే
  • అన్ని అంశాలను ప్రజల ముందు ఉంచుతున్నా..
  • హోం మంత్రి అమిత్‌ ‌షాతో గవర్నర్‌ ‌తమిళి సై భేటి

’‌రాష్ట్ర గవర్నర్‌ ‌హోదాలో కాకపోయినా… ఒక సాధారణ వ్యక్తిగా, అందులో మహిళగా, తెలంగాణ సిస్టర్‌(‌సోదరిని)గా నాకు గౌరవం ఇవ్వాలా? వద్దా?. తెలంగాణ స్టేట్‌ ‌కు రిచ్‌ ‌కల్చర్‌ ఉం‌ది. ప్రతి ఒక్కరు బ్రదర్‌ అం‌డ్‌ ‌సిస్టర్‌ ‌లా కలిసి ఉంటారు. కానీ, ఒక మహిళగా నన్ను అవమానించడం, నిర్లక్ష్యం చేయడం సరైందా? అన్నది నా ప్రశ్న. నావైపు నుంచి నేను ఎన్నోసార్లు సిఎం, ప్రభుత్వానికి ఆహ్వానం పంపినా, కమ్యూనికేట్‌ ‌చేసినా… వాళ్లు రాలేదు, స్పందించలేదు’’ అని గవర్నర్‌ ‌తమిళి సై మరోసారి ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.దిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్‌ ‌తమిళి సై గురువారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ ‌షా తో భేటి అయ్యారు. దాదాపు 50 నిమిషాలకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రస్తావించారు.

అనంతరం ఆమె తెలంగాణ భవన్‌ ‌లోని శబరీ బ్లాక్‌ ‌లో మీడియాతో మాట్లాడుతూ ..’’ తాను ఏ అంశాల్లో రాజకీయం చేస్తున్నానో ప్రభుత్వ పెద్దలు చెప్తే… వారికి ఆన్సర్‌ ‌చెప్తానన్నారు. రాజ్‌ ‌భవన్‌ ‌తలుపులు తెరిచే ఉంటాయి. సిఎం, మంత్రులు, చీఫ్‌ ‌సెక్రటరీ ఎవరు రావాలన్నా రావచ్చు. సమస్య ఏంటో నాకు వివరించలి.. అంతే కాని ఈ అవమానకర ప్రవర్తన ఎందుకు అని ఫైర్‌ అయ్యారు. వారు రావడం లేదన్నారు. తనతో సంప్రదింపులు చేయకుండా ప్రెస్‌ ‌తో గవర్నర్‌ ‌రాజకీయం చేస్తున్నారని మాట్లాడడం సరికాదన్నారు. ‘‘రండి… వచ్చి ప్రశ్నించండి. ఇది మా ప్రాబ్లం అని చెప్పండి. నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను’’ అని స్పష్టం చేశారు. ‘‘నేను ఏమైనా బిజేపి పార్టీ కార్యక్రమానికి(ఆవిర్బావం దినం) వెళ్లి జెండా ఎగురవేసానా?. నేనేమైనా అక్కడి వెళ్లానా? నాకేమైనా బిజేపి బెటాలియన్‌ ‌కల్పించిందా?’’ అని ప్రశ్నించారు. గవర్నర్‌ ‌హోదాలో కాకపోయినా…

ఒక సాధారణ భక్తురాలిగా తన భర్తతో కలిసి లక్ష్మీ నర్సింహా స్వామి దర్శనం కోసం వెళ్లినట్లు చెప్పారు. అయితే, ప్రభుత్వానికి వచ్చిన ఈగో(అహంకారం)పై తాను ఏమాత్రం బాధపడడం లేదన్నారు.నెక్ట్ ‌డే గవర్నర్‌ ‌ను ఆహ్వానించడానికి అధికారులు రాలేదని మీడియాలో సైతం వచ్చిందన్నారు. ఎలాంటి సాక్ష్యం లేకుండా తనను బిజేపి కార్యకర్త అని ఎలా అంటారని సీరియస్‌ అయ్యారు. ‘రాజ్‌ ‌భవన్‌- ‌ప్రగతి భవన్‌ ‌మధ్య దూరం, తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఓపెన్‌ ‌సీక్రెట్‌. ఇదే అంశంపై మళ్లీ మళ్లీ ఎందుకు స్పందించడం.ఈ అంశాన్ని పీపుల్‌ ‌డొమైన్లో పెట్టాను. నా విషయంలో తెలంగాణలో జరిగింది… కరెక్టా? కాదా? అన్ని ప్రజలు నిర్ణయిస్తారు. నేను ఏది హైడ్‌(‌దాచడం) లేదు’ అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page