మండలి ఛైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 12: రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ ఎన్నిక కోసం శనివారం నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. ఈనెల 14న చైర్మన్‌ ఎన్నిక జరుగనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు.

గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డికే మరోమారు కౌన్సిల్‌ ‌చైర్మన్‌గా సీఎం కేసీఆర్‌ అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో గుత్తా నామినేషన్‌ ‌వేయనున్నారు. దీంతో ఆయనే మళ్లీ మండలి ఛైర్మన్‌గా ఎన్నికవుతారు. మండలిలో టిఆర్‌ఎస్‌కు బలం ఉండడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page