భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం

  • గ్లోబల్‌ ‌రిటైల్‌ ఇం‌డెక్స్‌లో రెండో స్థానంలో
  • యూపిలో పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని మోడీ
  • దేశానికి యూపి రోల్‌ ‌మాడల్‌ ‌కాబోతుందన్న ప్రధాని
  • ఆదాని, అంబానీ తదితర వ్యాపార దిగ్గజాల హాజరు

లక్నో, జూన్‌ 3 : ‌భారత సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తుందని..జీ 20 ఆర్థిక వ్యవస్థలలో తాము వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రాలతో భారతదేశం పురోగమించిందన్నారు. వొచ్చే పదేళ్లలో భారతదేశానికి ఉత్తర్‌ ‌ప్రదేశ్‌ ‌రాష్ట్రం ఒక దిక్సూచి అవుతుందని..చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. లక్నోలో యూపీ పెట్టుబడుదారుల సదస్సులో సుమారు రూ. 80 వేల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని, ఇదొక రికార్డు అన్నారు. శుక్రవారం లక్నోలో యూపీ ఇన్వెస్టర్స్ ‌సమ్మిట్‌ 3.0 ‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. తమ ప్రభుత్వం ఇటీవలే 8 సంవత్సరాల పాలన పూర్తి చేసుకోవడం జరిగిందని, సంస్కరణలు, పనితీరు.. ఇతర వాటిని అమలు పరుస్తూ.. పురోగించడం జరిగిందన్నారు. సమన్వయంతో చేసుకుంటూ సులభంగా వ్యాపారం చేయడంపై దృష్టి కేంద్రీకరించామన్నారు. నేడు భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తుందని, దేశం పని తీరును ప్రశంసిస్తుందన్నారు. జి20 ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా దేశం అభివృద్ధి చెందిందని, గ్లోబల్‌ ‌రిటైల్‌ ఇం‌డెక్స్‌లో దేశం రెండో స్థానంలో ఉందని వెల్లడించారు.

ప్రస్తుతం జరుగుతున్న పెట్టుబడిదారుల సదస్సులో రూ. 80 వేల కోట్ల కంటే పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని, దీని ఫలితంగా యువత ఎక్కవ ప్రయోజనం పొందుతారనే ఆశాభావం వ్యక్తం చేశారు. భారత శక్తి సామర్థ్యాలను చూసి ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత 8 ఏళ్ల పాలనలో గొప్ప పురోగతి సాధించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. స్థిరత్వం, సహకారం, సులభతర వాణిజ్య విధానంపైనే దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా వ్యవసాయం, తయారీ, పునరుత్పాదక శక్తి, ఎంఎస్‌ఎంఈ, ‌ఫార్మా, పర్యాటకం, రక్షణ, వాయుమార్గం, వస్త్ర పరిశ్రమలకు సంబంధించిన 1,406 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. వీటి విలువ రూ.80,000కోట్లు. 21 శతాబ్దంలో భారత అభివృద్ధికి యూపీనే ఊతమిస్తుందని అన్నారు. వొచ్చే పదేళ్లు దేశానికి ఛోదక శక్తిగా యూపీనే ఉంటుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ‘భారత శక్తి సామర్థ్యాలను చూసి ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి.

జీ-20 దేశాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదే. గ్లోబల్‌ ‌రిటైల్‌ ఇం‌డెక్స్‌లో భారత్‌ది రెండో స్థానం. ఉత్తర్‌‌ప్రదేశ్లో గంగానది 1100కిలోవి•టర్ల మేర ప్రవహిస్తుంది. 25-30జిల్లాల నుంచి వెళ్తోంది సహజ వ్యవసాయ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌స్కీమ్‌ను యూపీ ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్‌ ‌ప్రపంచానికి ఇదే సువర్ణావకాశం’ అని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గౌతం అదానీ, కుమార మంగళం బిర్లా వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ప్రారంభోత్సవంలో మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ‌రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌కూడా పాల్గొన్నారు. యూపీ ఇన్వెస్టర్ల మొదటి సదస్సు 2018 జులై 29న జరిగింది. ఈ కార్యక్రమంలో రూ.61,500కోట్లు విలువ చేసే 81 ప్రాజెక్టులను ప్రారంభించారు. 2019 జులై 28న జరిగిన రెండో విడత సదస్సులో రూ.67,000కోట్లు విలువ చేసే 290 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page