బాన్స్‌వాడకు రండి.. ‘డబుల్‌’ ఇళ్లు చూపిస్తాం

విపక్షాల విమర్శలకు మంత్రి హరీష్‌ ‌రావు సవాల్‌
‌కాళేశ్వరం సాధ్యమేనా అన్న విపక్షాలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తాయి
నర్సింగ్‌ ‌కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన
నీటి సౌలత్‌ ‌వల్ల రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందన్న మంత్రి
లాభదాయక పంటలనే వేయాలన్న స్పీకర్‌ ‌పోచారం
జుకోరా ఎత్తిపోతలకు స్పీకర్‌తో కలసి శంకుస్థాపన

కామారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 29 : ‌డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల నిర్మాణంపై విమర్శలు చేసే పార్టీలు బాన్సువాడ నియోజకవర్గాన్ని చూడాలని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. బాన్సువాడ వొస్తే తెలంగాణ అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని ప్రతిపక్షాలకు మంత్రి హరీశ్‌రావు సవాల్‌ ‌విసరారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కాలేజీలో నూతనగా నిర్మించనున్న నర్సింగ్‌ ‌కాలేజీ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం•మేర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..అసెంబ్లీ స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి తమకు మార్గదర్శి అన్నారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభం ఉన్న నేత, బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధిపై దూరదృష్టి ఉన్న నేతే కాకుండా డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్ల నిర్మాణంలో పోచారం ముందు వరసలో ఉన్నారని మంత్రి ప్రశంసించారు. స్పీకర్‌ ‌పోచారంను అంకుల్‌ అం‌టూ మంత్రి సంబోధిస్తూ ప్రసంగాన్ని ప్రారంభిచడంతో సభా ప్రాంగణంలో నవ్వులు పూసాయి. కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యమేనా అని మాట్లాడిన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టుల నిర్మాణంపై అవినీతి ఆరోపణలు చేసి విపక్షాలు భంగపడ్డాయన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు దేశంలో ఎక్కడా నిర్మించ లేదు. ఇది ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. కాంగ్రెస్‌, ‌తెలుగుదేశం పార్టీ హయాంలో నిజాంసాగర్‌ ఎం‌డిపోయింది నిజం కాదా అని సూటిగా ప్రశ్నించారు. రైతులకు సాగు, ప్రజలకు తాగునీరు ఇచ్చిన ఘనత ఒక్క టీఆర్‌ఎస్‌ ‌పార్టీదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవరసం ఉన్నా లేకున్నా సిజేరియన్‌లు చేస్తున్నారు. ఇందుకు కుటుంబ సభ్యులే సహకరిస్తున్నారని, ఇది మంచి పరిణామం కాదన్నారు. తొందరపడి సిజేరియన్‌లను ప్రోత్సహించ వద్దని మంత్రి సూచించారు. వీటి వల్ల శిశువుకు తల్లి ముర్రు పాలు అందడంలేదని, దీంతో శిశువులు చాలా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ కార్యకర్తలు, వైద్యాధికారులు నార్మల్‌ ‌డెలివరీ చేసుకునేలా కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ ఇవ్వాలన్నారు. అలాగే బాన్సువాడ దవాఖానకు నూతన డాక్టర్లను మంజూరు చేస్తామని అన్నారు. నూతన పోస్టుమార్టం రూమ్‌ ‌నిర్మాణం చేస్తామన్నారు. కొరోనా సమయంలో అంగన్‌ ‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎం‌లు బాగా పనిచేశారని, ఇదే స్ఫూర్తితో ఇక ముందు కూడా ప్రజలకు సేవలు అందించడంలో ముందుండాలన్నారు. కార్యక్రమంలో స్పీకర్‌ ‌పోచారం, తదితరులు పాల్గొన్నారు.

నీటి సౌలత్‌ ‌వల్ల రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందన్న మంత్రి
రాష్ట్రంలో పండుతున్న ధాన్యాన్ని చూసి కేంద్ర మంత్రులే ఆశ్చర్యపోతున్నారని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ప్రభుత్వ విధానాల వల్లే ధాన్యం ఈ స్థాయిలో పండుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో పంటల సమృద్ధిని చూసి కేంద్రానికి కడుపుమంటగా ఉందని విమర్శించారు. నిజామాబాద్‌ ‌జిల్లాలోని వర్ని మండలంలో జాకోరా ఎత్తిపోతల పథకానికి స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం హరీష్‌ ‌రావు మాట్లాడుతూ.. జాకోరా లిప్ట్‌ను చూసి విపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని విమర్శించారు. నిజాం నవాబులు కట్టిన ప్రాజెక్టులు తప్ప ఏడు దశాబ్దాల్లో గత ప్రభుత్వాలు కట్టినవి ఏవీ లేవన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు కరెంటు, ఎరువుల కొరత ఉండేదని చెప్పారు. దానికోసం రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేసే పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నామని, ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామని చెప్పారు. గతంలో వర్షం కోసం రైతులు ఎదురుచూసేవారని, ఇప్పుడు కాళేశ్వరం, సింగూరు వంటి ప్రాజెక్టులతో ఆకాశం వైపు చూసే పరిస్థితిలేదన్నారు. బీజేపీ ప్రజలకు చేసిందేవి• లేదని విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూడటమే బీజేపీ పని అని విమర్శించారు. నరేంద్ర మోదీ పాలనలో బుల్లెట్‌ ‌రైలు రాలేదుకానీ..ఉన్న రైళ్లను, రైల్వే స్టేషన్లను అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎందుకు నింపడంలేదని ప్రశ్నించారు. నష్టాలను సాకుగా చూపి ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్న బీజేపీ సర్కార్‌ ‌పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలకు రూ.11 లక్షల కోట్లు మాఫీ చేసిందన్నారు.

లాభదాయక పంటలనే వేయాలి : స్పీకర్‌ ‌పోచారం
సభలో స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి మాట్లాడుతూ..తన విజ్జప్తిపై వెంటనే ముఖ్యంమంత్రి స్పందించి జీవో ఇచ్చారని, వారికి తన ధన్యావాదాలు తెలిపారు. గోదావరి నీళ్లు మంజీరాకు రావడం వల్లే జాకోరాలో లిప్ట్ ఇరిగేషన్‌ ‌సాధ్యమైందని, లిప్ట్ ‌నిర్మాణం పూర్తి అయితే 6 వేల ఏకరాలకు సాగునీరు అందుతుందని ఆయన తెలిపారు. త్వరలో చందూరు లిప్ట్‌కు కూడా శంకుస్థాపన చేస్తామని ఆయన తెలిపారు. చింతకుంటలో కూడా మోటార్లు పెట్టి చెరువులు నింపుతామని, లిప్ట్ ‌లకు ప్రజలు సహాకరించాలని ఆయన కోరారు. రెండు పంటలు పండించుకునే భాధ్యత రైతన్నలదేనని, నియోజకవర్గంలో మరింత సాగునీరు అందిస్తే 15 వందల కోట్లరూపాయల డబ్బు రైతన్నజేబులోకి చేరుతుందని ఆయన అన్నారు. ఏ పంటకు డబ్బు అధికంగా వస్తుందో అదే పంట వేసి లాభం పొందాలని, పంటల సాగు చేసే విషయంలో రైతుకురైతే శత్రువు కాకుడదని ఆయన హితవు పలికారు. రైతు వేదికలను రైతులందరూ వినియోగించుకోవాలన్నారు. రైతువేదికలను పత్తాలు అడటానికి, మద్యపాన కేంద్రాలుగా మార్చొద్దని సూచించారు. అత్యధిక దిగుబడులు సాధించడంలో మా నియోజకవర్గ రైతులు అందరికి ఆదర్శమని, ఆయిల్‌ ‌పామ్‌కు మంచి గిరాకీ ఉంది.. రైతులు ఆదిశగా వినూత్నంగా ఆలోచించాలన్నారు. కష్టపడే రైతన్న మరింత వినూత్నంగా ఆలోచించాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా రైతులకు సహాకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రైతులు తమ ఆదాయాన్ని తల్లికి, భార్య వద్ద దాచుకునే సంస్కృతి ఆర్మూర్‌ ‌రైతులదని, ఆ సంస్కృతిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రైతన్న చేయి ఎప్పుడూ పైనే ఉండాలి.. అప్పులు తీసుకుని పంటలు పండించే స్దితి నుండి సొంతంగా పెట్టుబడులతో అత్యధిక లాభాలు రావాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష అన్నారు. నిజాంసాగర్‌ ‌ప్రాజెక్టు కాకుండా మిగిలిపోయినా భూమిని సాగులోకి తీసుకురావడమే నా లక్ష్యమన్నారు. నిజామాబాద్‌ ‌జిల్లా వర్ని మండలం జాకోరాలో 69.52 కొట్ల వ్యయంతో నిర్మిస్తున్న లిప్ట్ ఇరిగేషన్‌ ‌పనులకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు శంకుస్దాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ‌నారాయణ రెడ్డి, ఇరిగేషన్‌ అధికారులు .జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page