భారత్ బాక్సింగ్ క్రీడలో
చిరస్మరణీయ శుభ దినం
తెలంగాణ మట్టి మాణిక్యం
టర్కీ వేదికపై మెరిసిన క్షణం
ఇందూరు గడ్డ బిడ్డ నిఖత్ జరీన్
ప్రపంచ విజేతగా నిలిచిన వైనం
యావత్ భారతీయ జనగణం
గర్వంతో తలెత్తుకున్న సందర్భం
దూకుడే అస్త్రంగా
విజయమే లక్ష్యంగా
పిడిగుద్దులు కురిపించి
ప్రత్యర్థిని మట్టి కరిపించి
ప్రపంచ విజేతగా విరిసింది
పసిడి పతకాన్ని ఒడిసిపట్టి
త్రివర్ణ పతాకాన్ని ఎగరేసింది
వరల్డ్ ఉమెన్ బాక్సింగ్ పోటీలో
స్వర్ణ సాదించిన తొలి తెలుగు
క్రీడాకారిణిగా చరిత్ర లిఖించింది
అడ్డంకులు అభ్యంతరాలు
అవమానాలు ఎన్ని ఎదురైనా
తను మాత్రం తగ్గేదేలే అంటూ
విజయాలతో బదులు పలికింది
మహానగరాల్లో మాత్రమే కాదు
పట్టణాల నుంచి కూడ విజేతలు
అవతరిస్తారని జగతికి చాటింది
ప్రపంచ క్రీడా దిగ్గజం
భారత స్వర్ణ కిరీటం
తెలంగాణ కీర్తి కేతనం
బాక్సర్ నిఖాత్ జరీన్‌కు
అఖిల జన జయ హారతి
నిఖిల జగతి వినమ్ర ప్రణతి
(ప్రపంచ బాక్సింగ్ విజేత నిఖత్ జరినాకు అభినందనగా..)
– కోడిగూటి తిరుపతి,9573929493