పండుగ వేళ తీగుల్ గ్రామంలో విషాదం
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవపూర్ మండలం తీగుల్ గ్రామంలో బతుకమ్మ పండుగ వేళ విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. బతుకమ్మ పండగ సంబురాల్లో భాగంగా తిగుల్ గ్రామంలోని పటేల్ చెరువు కట్ట వద్ద గల బతుకమ్మలను వేసే ఘాట్ వద్ద పిచ్చి చెట్లు మొలవడంతో చెట్లను నిర్మూలించే క్రమంలో ప్రమాదవశాత్తు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పని చేసే సపాయి కార్మికులు కరెమొల్ల బాబు(25), గిరిపల్లి భారతి(40), ఏళ్లం యాదమ్మ(43)లు బతుకమ్మ ఘాట్ వద్ద గల మెట్లపై నుండి జారీ చెరువులో పడి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ భాను ప్రకాష్ రావు సంఘటన స్థలానికి చేరుకొని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు భారీగా చెరువు వద్దకు చేరుకోవడంతో గ్రామంలో పండగ పూట విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. గల్లంతైన ముగ్గురి శవాలను గజ ఈతగాళ్లతో సహాయంతో బయటకు తీశారు.