బడిబాట కార్యక్రమం ఆశించిన ఫలితాలు సాధించేనా…!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బడి బాట కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ రూపొందించిన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయ, ఉపాధ్యయనీయులు పాల్గొని ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి బడికి వెళ్లె పిల్లల సంఖ్య తెలుసుకుంటూ స్కూల్ కు వెళ్లని పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ బాల కార్మిక నిర్మూలనకై కృషి చేస్తున్నారు. రోజు జిల్లాలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు‌ అవగాహన ర్యాలీని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.‌ టీచర్లు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ తమ పిల్లలను ప్రభుత్వ బడులకు పంపాలని కోరుతున్నారు. సర్కార్ పాఠశాలల్లో 1వ తరగతి‌ నుంచి 10 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం, డిజిటల్ స్మార్ట్ బోర్డ్ , నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామని వారి తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం జూన్ 19 వరకు కొనసాగనున్న ఈ బడిబాటలో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కానీ ఇది ఎంత వరకు అమలు అవుతుందో వేచి చూడాలి.

పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదివితే వచ్చే విద్యా, ఆపై అవకాశాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించబోతున్నారు కానీ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉత్తీర్ణత సాధించలేక పోతున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జూన్ 12న స్కూళ్లను పునర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సరికొత్త  విధానం అమలు చేయనున్నారు అధికారులు గత ప్రభుత్వం కూడా ప్రభుత్వ బడుల బలోపేతానికి విశేషమైన కృషి చేసింది ప్రస్తుత గవర్నమెంట్ గతం కన్నా మెరుగు పని చేస్తుందని చెప్పుచున్న ఫలితాలు ఎలా ఉంటాయని ముందు ముందు చూడవచ్చు.  కాంగ్రెస్ ప్రభుత్వం బడి బాట ప్రచారాన్ని అమ్మ కమిటీలకే బాగోగులు, బాధ్యతలను అప్పగించారు. ప్రైవేటు మోజు నుంచి తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేయనున్నారు సంబంధింత అధికారులు. బడి బాట కార్యక్రమంలో అనేక అంశాలను అధికారులు ప్రచారం చేయనున్నారు అవి ఏమిటంటే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకురావడం, విద్యార్థుల నమోదు శాతం పెంచటం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈసారి ప్రభుత్వం వినూత్నంగా ప్రచారం ప్రారంభించింది కానీ ఎంత వరకు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను జాయిన్  చేస్తారన్నది చర్చ.

గవర్నమెంట్ బడులలో నాణ్యమైన విద్యను పిల్లలకు అందించాలని తల్లిదండ్రులను చైతన్యవంతులను చేస్తుంది ప్రభుత్వం. ప్రైవేటు స్కూల్స్ లో చేరితే రూ.50 వేల నుంచి రూ 1.50 లక్షల వరకు ఖర్చవుతుందని, ఇప్పుడు ఆదా చేసే డబ్బును మీ పిల్లల ఉన్నత చదువులకు పొదుపు చేయమంటూ సరికొత్తగా ప్రచారం చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది కానీ దాంట్లో ఎంత వరకు విజయం సాధిస్తుందో చూడాలి. ప్రైవేటుపై మోజు తగ్గించేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా తల్లిదండ్రుల్లో మార్పు తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రమంతటా ప్రతి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసింది. వీటి అధ్వర్యంలో అన్ని పాఠశాలలను కొత్త హంగులతో తీర్చిదిద్దుతోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌, తెలుగు మీడియంలో విద్యాబోధనతోపాటు విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఒక జత షూస్‌ను ఉచితంగా అందిస్తోంది ప్రభుత్వం. బడి ఈడు పిల్లలను, బడి మానేసిన విద్యారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు అమ్మ ఆదర్శ కమిటీలతోపాటు, విద్యా శాఖాధికారులు, హెడ్మాస్టర్లు, యువజన సంఘాలు, ప్రజా ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఇదే బడిబాట సందర్భంగా ప్రైవేటు స్కూళ్లపై మోజు తగ్గించి ప్రభుత్వ పాఠశాలల పునర్వ వైభవానికి కృషి చేసేలా విస్తృత ప్రచారం చేపట్టాలని, తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నం జరగాలని ముఖ్యమంత్రి విద్యాశాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

పాఠశాలల బాగోగులు, బాధ్యతలను అమ్మ కమిటీలకు అప్పగించిన ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో ఆశించిన స్థాయిలో విద్యార్థుల నమోదు శాతం పెరిగి ఆశించిన ఫలితాలు వొస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో మొత్తం 26,823 పాఠశాలలను గుర్తించింది. 20,680 చోట్ల ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేశారని సమాచారం. 17,729 పాఠశాలల్లో అవసరమైన పనులన్నీ ఈ కమిటీలకు అప్పగించారు. పాఠశాలల్లో తలుపులు, కిటికీలు, బ్లాక్ బోర్డులు, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు, ఫ్యాన్లు, మరుగుదొడ్ల తాత్కాలిక మరమ్మతుల పనులన్నింటినీ ప్రభుత్వం పాఠశాల పునర్ ప్రారంభానికి ముందే మొదలు పెట్టింది. ఈ పనులకు రూ.667.25 కోట్లు కేటాయించింది.

అందులో ఇప్పటికే రూ.147 కోట్లు కమిటీలకు అడ్వాన్సుగా కూడా చెల్లించిందని సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న హడావుడి మంచిదే కానీ ఎంత వరకు అనుకున్న లక్ష్యాలు నెరవేరుస్తుందని అందరు ఎదురు చూస్తున్న తరుణం.  ప్రభుత్వానికి సంపూర్ణ అక్షరాస్యతను తీసుకు రావడం ఒక  సవాలుగా మారనుంది కేంద్ర, స్వచ్ఛంద సంస్థలు బాల కార్మికులు నిర్మూలకై పోరాడుతున్న పూర్తి స్థాయిలో బాల కార్మికులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమౌతున్నాయి. అదే విధంగా ప్రైవేటు స్కూల్ లలో ఫీజులను నియంత్రించ లేక పోతున్నాయి. దీంతో చదువు వ్యాపారంగా మారింది. పేద విద్యార్థులకు నాణ్యమైన చదువు అందలేక పోతుంది. ఐఐటీ, సీబీఎస్, ఎస్ ఎస్ సీ, వంటి సిలబస్ లు ప్రభుత్వ పాఠశాలలో పెడితే బాగుంటుందని విద్యార్థులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బడి బాట కార్యక్రమం ఎంతవరకు విజయవంతం కానుంది అని వేచి చూడాలి.

మిద్దె సురేష్
కవి, వ్యాసకర్త
9701209355 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page