Take a fresh look at your lifestyle.

పాండిచ్చేరిలో దారుణం బిజెపి నేత దారుణహత్య

పాండిచ్చేరి, మార్చి 27 : పుదుచ్చేరిలోని విలియనూర్‌ ‌లో దారుణం జరిగింది. సీనియర్‌ ‌బీజేపీ లీడర్‌ ‌రంగస్వామి కుమారుడు సెంథిల్‌ ‌కుమార్‌ (46)‌ను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా చంపేశారు. మంగళం నియోజక వర్గంలో ఆదివారం రాత్రి జరిగిన బీజేపీ టింగ్‌ ‌లో పాల్గొన్న ఆయన.. విలియనూర్‌ ‌కణ్ణగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సపంలోని ఓ బేకరీ షాపులో టీ తాగాడు. ఆ టైంలో 3 బైక్‌ ‌పై వచ్చిన 9 మంది గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి సెంథిల్‌ ‌కుమార్‌ ‌పై దాడి చేశారు. మొదట అతనిపై బాంబు దాడి చేశారు.

దాంతో కంగారు పడి పరిగెత్తిన సెంథిల్‌ ‌పై మరోసారి బాంబు విసిరారు. దాంతో గాయాలై కిందపడ్డ సెంథిల్‌ ‌ను చుట్టుముట్టిన ముఠా… కత్తులతో అతి కిరాతకంగా దాడి చేసి చంపేశారు. తర్వాత దాడి చేసిన ముటా బైక్‌ ‌లపై అక్కడినుంచి పారిపోయింది. హత్య సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ ‌మార్టం కోసం ప్రభుత్వం హాస్పిటల్‌ ‌కి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. హంతకులను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృదాల్లా ఏర్పాటై దర్యాప్తు చేస్తున్నారు. బేకరీ షాపులో ఉన్న సీసీ  కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరీశీ లించి.. ఆ ఆధారాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply