5నుంచి బెంగాల్ లో మహిళలకు స్వేఛ్చ

– రాత్రి ఒంటిగంట తరవాత కూడా స్వేచ్చగా రావచ్చు
– ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా

కోల్ కతా, ఏప్రిల్ 25: బెంగాలీ మహిళలు ప్రస్తుతం భయంతో జీవిస్తున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మహిళలు సాయంత్రం ఏడు తర్వాత బయట రావద్దంటూ మమతా బెనర్జీ గతంలో చేసిన వ్యాఖ్యలను విమర్శించారు. మే 5 తేదీ తర్వాతి నుంచి పశ్చిమ బెంగాల్ మహిళలు రాత్రి ఒంటిగంట తర్వాత కూడా భయం లేకుండా రోడ్లపై తిరగొచ్చని పేర్కొన్నారు. బెంగాల్ లోని పూర్బ బర్ధమాన్ జిల్లాలోని జమాల్పూర్ గ్రామంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో విఫలమయ్యారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. మహిళా ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పాలనకు సంకేతమా అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ మహిళలు ధైర్యంగా ఉన్నారని, మే 5 తర్వాత బెంగాలీ మహిళల పరిస్థితి కూడా మెరుగుపడుతుందని అన్నారు. తల్లులు, సోదరీమణుల వైపు దురుద్దేశంతో చూసేందుకు ఏ దుండగుడు సాహసించినా వారిని జైలులో పెడతామని హామీ ఇస్తున్నామ‌న్నారు. పదిహేను సంవత్సరాల మమతా బెనర్జీ పాలనలో అత్యధికంగా నష్టపోయిన వారు మన తల్లులు, సోదరీమణులే.. బెంగాల్లో మహిళలపై ఎన్నో హింసాత్మక ఘటనలు జరిగాయి.. మహిళలు రాత్రి 7 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రాకూడదని దీదీ అంటున్నారు.. నేను మీకు చెప్పేదేమిటంటే 5వ తేదీ తర్వాత యువతులు రాత్రి 1 గంట తర్వాత కూడా బయటకు రాగలరు అని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *