అజ్మీర్ దర్గా ఖాదిం సల్మాన్ చిస్తీ అరెస్ట్
జైపూర్, జూలై 6 : రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాలో ఖాదింగా చేస్తున్న సల్మాన్ చిస్తీని పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ బహిష్క•త నేత నుపుర్ శర్మ్ తల నరికి తెస్తే వాళ్లకు తనఇల్లు ఇస్తానని ఖాదిం సల్మాన్ చిస్తీ ఓ వీడియోలో పేర్కొన్నారు. ఆ వీడియోఆధారంగా సోమ వారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని బుధవారం రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్ని ముస్లిం దేశాలకు సమాధానం ఇవ్వాలని, తాను అజ్మీర్ నుంచి మాట్లాడు తున్నానని, ఇది హుజూర్ ఖ్వాజా బాబాకా దర్బార్ నుంచి వచ్చిన సందేశమని తన వీడియోలోసల్మాన్ చిస్తీ తెలిపారు.
దర్గా బాబా సల్మాన్‌కు క్రిమినల్ రికార్డుఉన్నట్లు పోలీసు ఆఫీసర్ దల్వీర్ సింగ్ ఫౌజ్‌దార్ తెలిపారు. అజ్మీర్‌దర్గా ఆఫీసుదీవాన్ ఆవీడియోను ఖండించారు. దర్గా మతసామ రస్యానికి ప్రతీక అన్నారు. ఖాదిం సల్మాన్ తన వీడియోలో వెల్లడించిన అభిప్రాయాలు దర్గా సందేశంగా భావిం చరాదన్నారు. ఇప్పటికే ఉదయ్‌పూర్ హత్యతో రాజస్థాన్‌లో ఆందో ళనకర పరిస్థితులు ఉన్నాయి.