నిఖత్‌ ‌పట్టుదలకు ప్ర‘పంచ్‌’ ‌పసిడి పతకం

14 జూన్‌ 1996‌న నిజామాబాద్‌?‌లో ప్రవీణ్‌ ‌సుల్తానా – మహమ్మద్‌? ‌జమిల్‌ అహమ్మద్‌? ‌దంపతులకు మూడవ కూతురుగా జన్మించిన 25 ఏండ్ల నిఖత్‌ ‌జరీన్‌ ఔత్సాహిక బాక్సర్‌ ‌టర్కీ ఇస్తాంబుల్‌లో జరిగిన ‘ప్రపంచ మహిళగా బాక్సింగ్‌ ‌ఛాంపియన్‌షిప్‌’‌లో 52 కేజీల ఫ్లైవేయిట్‌ ‌కేటగిరీ ఫైనల్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన ‘జిట్‌పాంగ్‌ ‌జుటామస్‌’‌తో తలపడి పసిడి పతకాన్ని సొంతం చేసుకొని తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. ప్రపంచ బాక్సింగ్‌ ‌ఛాంపియన్‌షిప్‌ను గతంలో మేరీ కోమ్‌, ‌సరితాదేవి, జెన్నీ ఆర్‌యల్‌, ‌లేఖ కెసిలు గెలువగా నేడు 5వ భారత మహిళా విజేతగా నిఖత్‌ ‌జరీన్‌ ‌నిలువడం హర్షదాయకం.

నిజామాబాద్‌?‌లోని నిర్మల హృదయ బాలికల ఉన్నత పాఠశాలలో విద్య పూర్తి చేసి, ప్రస్తుతం ఏ. వి. కళాశాలలో బి. ఏ. చేస్తున్న నిఖత్‌ ‌బాల్యం నుంచే బాక్సింగ్‌ ‌క్రీడ పట్ల ఆకర్షితురాలై తన సమీప బంధువు బాక్సింగ్‌ ‌కోచ్‌ ‌శంశముద్దీన్‌ ‌వద్ద తొలి క్రీడా మెళుకువలు నేర్చుకుంది. 2009లో విశాఖపట్నం ‘స్పోర్టస్ అథారిటీ ఆఫ్‌ ఇం‌డియా’లో ద్రోణాచార్య ఆవార్డు గ్రహీత ఆ. వి. రావు శిష్యరికంలో శిక్షణ పొంది 2010లోనే ఎరోడ్‌ ‌నేషవల్స్ ‘‌గోల్డెన్‌ ‌బెస్ట్ ‌బాక్సర్‌’‌గా గుర్తింపు పొందింది. తన క్రీడా నైపుణ్యాన్ని గుర్తించిన యస్‌బిఐ యాజమాన్యం జరీన్‌ను స్టాఫ్‌ ఆఫీసర్‌గా నియమించింది. ‘స్పోర్టస్ అథారిటీ ఆఫ్‌ ‌తెలంగాణ స్టేట్‌’ ‌తరపున తెలంగాణ క్రీడా శాఖమంత్రి వి. శ్రీనివాస్‌ ‌గౌడ్‌ 2020‌లో ఒక ఎలక్ట్రిక్‌ ‌స్కూటర్‌, 10,000/- ‌నగదును బహుకరించి ప్రోత్సహించారు.

2011లో టర్కీలో జరిగిన ‘జూనియర్‌ ‌యూత్‌ ‌ప్రపంచ బాక్సింగ్‌ ‌ఛాంపియన్‌షిప్‌’‌లో బంగారు పతకం, 2014లో సెర్బియాలో జరిగిన ‘ఇంటర్నేషనల్‌ ‌బాక్సింగ్‌ ‌టోర్నమెంట్‌’‌లో బంగారు పతకం, 2015లో ‘థాయ్‌ ఓపెన్‌ ‌సీనియర్‌ ‌మహిళా బాక్సింగ్‌ ‌టోర్నమెంట్‌’, ‌బ్యాంకాక్‌లో సిల్వర్‌ ‌మెడల్‌, 2019‌లో బల్గేరియాలో  ‘స్ట్రాండ్‌జా మెమోరియల్‌ ‌బాక్సింగ్‌ ‌పోటీ’ల్లో మూడుసార్లు విజేతగా నిలిచిన ‘టెటియానా కోబ్‌’‌ను 4 – 1తో ఓడించి బంగారు పతకం గెలుచుకున్న నిఖత్‌ ‌నేడు ‘ప్రపంచ మహిళా ఛాంపియన్‌షిప్‌’‌ను కైవసం చేసుకోవడం సంతోషదాయకం. ‘వెల్‌స్పన్‌ ‌గ్రూపు’ నుండి ఆర్థిక సహకారం పొందిన నిఖత్‌ 2018‌లో ‘అడిడాస్‌ ‌కంపెనీ’తో ‘బ్రాండ్‌ ఎం‌డార్స్‌మెంట్‌ ‌డీల్‌’‌కు సంతకం చేసింది.

నిజామాబాద్‌? అధికారిక ‘బ్రాండ్‌ అం‌బాసిడర్‌’‌గా నియామకంతో పాటు 2015లో ‘ఆల్‌ ఇం‌డియా ఇంటర్‌-‌యూనివర్సిటీ బాక్సింగ్‌ ‌పోటీ’ల్లో ‘బెస్ట్ ‌బాక్సర్‌’‌గా బహుమతి, 2019లో ’జెయఫ్‌డబ్ల్యూ అవార్డు ఫర్‌ ఎక్సలెన్స్ ఇన్‌ ‌స్పోర్టస్’ ‌బహుమతిని కూడా పొందింది. తొలి దశలో సమాజం నుంచి అనేక అవరోధాలు ఎదురైనా పట్టుదలతో నిలబడి, శ్రమించి, విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చిన 193 సెంటీమీటర్ల మీటర్ల ఎత్తు, 51 కేజీల బరువు ఉన్న నిఖత్‌ ‌జరీన్‌ ‌మన యువతకు ప్రేరణగా నిలిచింది. 2019లో మేరీ కోమ్‌ను ఛాలెంజ్‌ ‌చేస్తూ ప్రచ్ఛన్న యుద్దం చేసిన నిఖత్‌ ‌జరీన్‌ అకుంఠిత దీక్ష,, ప్రగాఢ పోరాట పటిమను  ప్రస్తుతించాల్సిందే. ఈ అపూర్వ విజయంతో టోక్యో ఓలంపిక్స్‌లో అర్హతను సాధించిన నిఖత్‌ ‌నేడు ‘ఈమని చిరంజీవి’ కోచింగ్‌లో ఎదిగిన జరీన్‌ ‌సమీప భవిష్యత్తులో ఓలంపిక్‌ ‌మెడల్‌ ‌సాధించాలని కోరుకుందాం.

  ‘‘వెల్‌డన్‌ ‌నిఖత్‌ – ‌వి ఆర్‌ ‌ప్రౌడ్‌ ఆప్‌ ‌యు – ఆల్‌ ‌ది బెస్ట్’’

dr burra madhusudhan reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *