పరకాల అభివృద్ధికి కృషి చేస్తఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
పరకాల, ప్రజాతంత్ర: తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన పరకాల నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన అందిస్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు . ఆదివారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు విజయోత్సవ ర్యాలీ ర్యాలీ నిర్వహించారు. పరకాల పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కూడలి సమావేశంలో రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గం నుండి కొద్దిరోజుల ముందే తనను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తనను అభిమానించి అపూర్వ విజయాన్ని అందించా రాణి ఆ విజయాన్ని కాంగ్రెస్ నేతలకు అంకితమిస్తున్నానని ఆయన అన్నారు. పరకాల నియోజకవర్గంలో పోలీసులు రెవెన్యూ అధికారులు ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని నిబంధనలను సక్రమంగా పాటించి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని కొనియాడారు. ఉద్యోగస్తులు భయంతో విధులు నిర్వహించవలసిన పరిస్థితులు పరకాలలో ఇప్పటివరకు ఉన్నాయని ఇకముందు ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి భయం లేకుండా తమ విధులను నిర్వహించాలని వారికి తమ పూర్తి సహకారం ఉంటుందని ఉద్యోగులకు పెద్దన్న వ్యవహరిస్తానని అభయామిచ్చారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అన్ని పాత సమితీలు జిల్లా కేంద్రాలుగా రెవిన్యూ డివిజన్ కేంద్రాలుగా ఏర్పడ్డాయని జిల్లాల పునరీకరణలో పరకాలకు అన్యాయం జరిగిందని దాంతో పరకాల వాసులు వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారని గతంలో పరకాల ఎమ్మెల్యేగా ఉన్న చల్ల ధర్మారెడ్డి జిల్లాల ఏర్పాటు సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాలని ఆయన కొత్త జిల్లాలు ఏర్పాటైన సందర్భంలో పట్టించుకోకపోవడం విదేశాల్లో జలసాల కోసం వెళ్లడంతో పరకాల కు తీవ్ర నష్టం జరిగిందన్నారు. అమరవీల జిల్లాగా పరకాల ఏర్పాటు చేసేందుకు తాను ఇప్పుడు హామీ ఇవ్వలేనని అయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ జిల్లాగా ఏర్పడిందని పరకాల కూడా జిల్లా ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు . ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారుల సూచనలను తీసుకొని జిల్లా ఏర్పాటు కోసం ప్రతిపాదనలు తీసుకొని వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్తానని దాంతో పరకాలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు మూలంగా పరకాలలో వ్యాపారాలు కుంటుపడ్డాయని దాంతో వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారని తిరిగి పరకాల వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేసినందుకు అన్ని చర్యలు చేపడతానని ఆయన హామీ ఇచ్చారు పరకాల నియోజకవర్గం లో పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య నెలకొందని పరకాల పోలీసుల సహకారం తీసుకొని నిరుద్యోగులకు అవసరమైన ఉచిత శిక్షణ తో పాటు ఉద్యోగం పొందేందుకు అవసరమైన చర్యలు చేపడతానని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చారు. మండలానికి ఒక బ్యాంకును మహిళల కోసం ఏర్పాటు చేస్తానని మహిళలకు అవసరమైన శిక్షణ అందించి యంత్ర పరికరాలు సమకూర్చి కార్పొరేట్ వ్యవస్థతో వారిని అనుసంధానం చేసి మహిళల అభ్యున్నతికి పాటుపడతానని అభయమించారు. అన్ని వర్గాల వారు తమను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారని ఆయన గుర్తు చేశారు. ఎన్నారై పోచంపల్లి తిరుపతిరెడ్డి తో పాటు రాజకీయాలలో తటస్థంగా ఉన్నవారు సైతం తన గెలుపు కోసం ఎంతో కృషి చేశారని వారు కాంగ్రెస్ నేతలతో సమన్వయం ఏర్పరచుకొని తమ గెలుపుకు కృషి చేశారని గుర్తు చేశారు. నర్సంపేట ప్రజలు తాను గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పరకాల నియోజకవర్గం లోని వారి స్నేహితులకు బంధుమిత్రులకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డికి ఓట్లు వేయాలని కోరడంతో తన విజయం పరకాల్లో సాధ్యమైందని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను ఆత్మకూరు మండలం పెంచికలపేటలో పదవ తరగతి వరకు చదివానని అప్పుడు తాను పరకాలకు వచ్చి పరీక్షలు రాశానని ఆయన తెలిపారు పరకాల గతంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు అభివృద్ధి చెందకుండా అదేవిధంగా ఉందని కేవలం సెంట్రల్ లైటింగ్ సిస్టం మాత్రమే కొత్తగా వచ్చిందని ఆయన తెలిపారు తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు గ్రామాల్లో తమ ఊరికి బసౌకర్యం లేదని కొందరు కొన్ని ట్రిప్పులే వస్తున్నాయని మరికొందరు ప్రజలు తన దృష్టికి తీసుకుని వచ్చారని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పరకాల డిపో మేనేజర్ తో చర్చించి గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు గతంలో టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నిర్లక్ష్యంతో పరకాల డిపోలో ఉన్నటువంటి 90 బస్సులు భూపాల్ పల్లి ఇతర డిపోలకు తరలి వెళ్లాయని దాంతో పరకాల వాసులకు బస్సు కోసం ఇబ్బందులు వస్తున్నాయని పరకాల ప్రజల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ రాష్ట్ర స్థాయి అధికారులతో చర్చలు జరిపి పరకాలకు ఆదరణ బస్సులు వచ్చేలా కృషి చేస్తానని ఆయన చెప్పారు పరకాల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని పరకాల క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం అన్ని చర్యలు చేపడతానని పరకాల ప్రాంతవాసులు తమ సమస్యలను క్యాంపు కార్యాలయంలో పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడతానని ఎమ్మెల్యేగా తాను అందుబాటులో ఉంటానని నేను లేని రోజుల రోజులలో సైతం సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని ఆయన పరకాల ప్రాంతవాసులకు పిలుపునిచ్చారు ఎవరికి ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకొని రావాలని వారి సమస్య పరిష్కారం కోసం తాను ప్రయత్నాలు చేస్తానని పరిష్కరిస్తానని ఆదాయం ఇచ్చారు విజయోత్సవ ర్యాలీ సందర్భంగా పరకాలలో ప్రజలు భారీ స్థాయిలో చేరుకున్నారు డిజె సౌండ్ తో పాటు కోలాటాలు దప్పు చప్పులతో కాంగ్రెస్ నేతలు సందడి చేశారు బస్టాండ్ ఆవరణలో వారి క్రియల ద్వారా గజమాలను ఎమ్మెల్యే చల్లధర్మ రెడ్డికి వేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దొమ్మటి సాంబయ్య గన్నోజు శ్రీనివాస చారి కట్కూరి దేవేందర్ రెడ్డి లతోపాటు వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పరకాల పోలీసులు విరోచర్యాల సందర్భంగా వాహనాలకు ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు