ఆ అధరాల మధ్య
విరిసిన చిరునగవు!
సరసపు ఊహకు
సిగ్గుపడ్డ మల్లెమొగ్గలా!
వాన మేఘాన్ని
దాచిన నీలాకాశంలా!
ముళ్ళు చుట్టుకుని
నవ్వే కొంటె గులాబీలా!
వృక్షాల తలని ఊపే
మందమారుతంలా!
నాగుల గుట్టపై
గంధపుచెట్టులా!
పిలిచావో తెలియదు!
పొమ్మన్నావో చెప్పదు!
ఆహ్వానిస్తున్నావో?
అల్లరి చేస్తున్నావో?
ఒంటరివా? తుంటరివా?
సంపంగివా? నాగినివా?
మతి హెచ్చరిస్తుంటే
మది ఊరిస్తోంది?
అయినా
ఆ నంగనాచి నవ్వుకు
లొంగిపోవటమే విక్రమమేమో?
ఓడిపోవటమే విజయమేమో?
అక్కడ
దాశ్యమే వీరస్వర్గమేమో?
– ఉషారం
9553875577