సుపరిపాలనా దక్షుడు
సకలగుణ సంపన్నుడు
సామాజిక విప్లవకారుడు
స్వతంత్య్ర సమరవీరుడు
అతడే..
పొలిటికల్ కింగ్ మేకర్
బెస్ట్ పార్లమెంటీరియన్
బాబు జగ్జీవన్ రామ్
అంతరాల వ్యవస్థ మీద
ధిక్కార స్వరమెత్తిన ధీరుడు
సాంఘీక దురాచారాల మీద
యుద్ధం ప్రకటించిన యోధుడు
స్వేచ్ఛా స్వాతంత్రం కోసం
సమరమ్ము సాగించిన వీరుడు
హరిత విప్లవోద్యమానికి
అండగా నిలిచిన ఆతిరథుడు
అణగారిన హక్కుల గొంతుకై
దశదిశలా వినిపించిన వీరుడు
కార్మిక శాఖ మాత్యులుగా
తొలి దళిత ఉప ప్రధానిగా
విశిష్టమైన సేవలు అందించి
వినతికెక్కిన మహనీయుడు
మాటకు కట్టుబడే తత్వం
మడమ తిప్పని ధీరత్వం
విలువల బాట వీడని ఇజం
బహుగుణ సంపన్న స్వంతం
యావత్ జీవితం జాతికి
అంకితమిచ్చిన మహర్షి
భావి తరాల మార్గదర్శికి
అనంత స్వర నీరాజనాలు
మహాజన జయ హారతులు
(ఏప్రిల్ 5 న బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా…)
– కోడిగూటి తిరుపతి, 9573929493