స్కామ్‌పై స్పందించాలన్న బిజెపి ఎంపి జివిఎల్
విశాఖపట్టణం, ఆగస్ట్ 24: లిక్కర్ స్కామ్‌పై దిల్లోలో డొంక కదిలితే ఆంధ్రా తెలంగాణాలో మూలాలు వెలుగు చూస్తున్నాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీకి సంబంధాలు వున్నట్లు తెలుస్తుందన్నారు. దీనిపై రెండు ప్రభుత్వాలు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్‌లో నిబంధనలు తుంగలోకి తొక్కరని దిల్లీ చీఫ్ విజిలెన్స్ విభాగం నిర్దారించిందని, ఢిల్లీ ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని జీవీఎల్ అన్నారు. ఎంతో విలువైన లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములు కేవలం రూ. 500 కోట్లకే ఒక ప్రైవేటు సంస్ధ చేజెక్కించుకుందంటే ఎంత దారుణమని జీవీఎల్ అన్నారు. జగన్ సర్కార్ స్పందించదా అని ప్రశ్నించారు. భూములను ఏ పర్పస్ కోసం ఇచ్చారన్నారు.
ల్యాండ్ అగ్రిమెంట్‌పై జరిగిన అంశాలు తెలపాలని డిమాండ్ చేశారు. ఓ ఎమ్మెల్యే కొడుకు సదరు సంస్ధలో డైరెక్టర్‌గా వున్నారని, వారికి ఉండే ఆసక్తి ఏంటో ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. విశాఖలో పెద్ద సంఖ్యలో వోటర్లను రద్దు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆంధ్రేతర ప్రాంతానికి చెందిన వోటర్లను కావాలని 50 వేలు మందిని జాబితాలోంచి తొలగించారన్నారు. దీనిపై చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు లేఖరాయడం జరిగిందని జీవీఎల్ పేర్కొన్నారు.
కేంద్రమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీపై బీజేపీ ఎంపీ జీవీల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరువురి భేటీలో రాజకీయ ప్రస్తావన లేకుండా వుండగలదా? అని అన్నారు. కేవలం సినిమా కోసమే మాట్లాడారని తాను అనుకోవడం లేదన్నారు. అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్ మధ్య రాజకీయాల ప్రస్తావన రాలేదని వేరే పార్టీ వాళ్లు ఎలా అంటారని ప్రశ్నించారు. అది వారి భయాన్ని సూచిస్తుందోన్నారు. వారిద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయో వారే చెప్పాలన్నారు. తన వద్ద ఎలాంటి సమాచారం లేదని డియా అడిగిన ప్రశ్నకు జీవీఎల్ సమాధానం ఇచ్చారు.