అవును నిజమే !
ఇది చిరస్మరణీయ దినం
అమరుల స్మరించే క్షణం
వీరుల స్తుతించే సమయం
రాష్ట్ర అవతరణ వేడుకలు
ఘనంగా జరుపుకునే తరుణం

అలాగే తెలంగాణ స్థితిగతులపై
సమీక్ష చేసుకోవాల్సిన సందర్బం

కోట్లాడి సాదించుకున్న రాష్ట్రం
కొత్తపుంతలు తొక్కలే సరికదా !
మరింత మసకబారుతున్న వైనం

ఎనిమిదేళ్ల పాలన గడిచినా
బంగారు తెలంగాణ కాకపోగా
బాకీల నెలవుగా మారిన దైన్యం!

ఇపుడు స్వంత రాష్ట్రంలో…
ఆకలి చావులు ఆత్మహత్యలు
రైతు తిప్పలు నిరుద్యోగ వెతలు
వలసకూలీల కష్టాలు కడగండ్లతో
దుర్భర దారిద్య్రం తాండవిస్తుంది

అధిపత్యాలు అణిచివేతలు
నిర్బందాలు అరాచకత్వాలతో
నిజాం నవాబు కాలం తలపిస్తుంది

ఇపుడు తెలంగాణ తల్లి
దొరల గడిల్లో బందీ అయింది
రాష్ట్రం దొంగల చేతికి చిక్కింది

ఈ సందిగ్ధ సందర్భంలో..
రాష్ట్ర అవతరణ వేడుకలు

విధిగా నిర్వహించుకుందాం
అదే సమయంలో..
తెలంగాణ విముక్తి కోసం
సామాజిక న్యాయం కోసం
మరో పోరుకు సిద్ధమవుదాం
(జూన్‌ 2 ‌న తెలంగాణరాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా..)
 – కోడిగూటి తిరుపతి: 9573929493

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *