- వారి కోసం త్వరలో రాష్ట్ర శాఖ మౌనదీక్ష
- నిధులు ఇవ్వకుండా గ్రామాలను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- సర్పంచ్‌లకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 31 : గ్రామాల స్వశక్తితో అభివృద్ధి పథంలో నడవాలన్నదే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ లక్ష్యమని, న్యాయమైన డిమాండ్ల కోసం గ్రామ సర్పంచ్‌లు చేసే ఆందోళనలకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్‌లకు ఆయన లేఖ రాశారు. 73, 74 రాజ్యాంగ అధికరణలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు. గ్రామసర్పంచ్‌ల హక్కుల పరిరక్షణ కోసం త్వరలోనే బీజేపీ శాఖ మౌనదీక్ష నిర్వహిస్తుందన్నారు. పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందన్నారు.
2014లో టీఆర్‌ఎస్ పార్టీ ‘గ్రావి•ణాభివృద్ధి’, ‘పంచాయతీరాజ్ వ్యవస్థ’ అనే అంశం కింద ఇచ్చిన హావి•లకు తిలోదకాలు ఇచ్చిందన్నారు. సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడవద్దని..అధైర్యపడవద్దని..