నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షల నెరేవేర్చేందుకు తెలంగాణ జనసభతో ఉద్యమం మొదలు పెట్టారు గద్దర్..తన పాటతో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు..అని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన పాటతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది..పీడిత, తాడిత ప్రజల పక్షాన గదర్ విప్పారు..అని పేర్కొంటూ భూమి, ఆకాశం ఉన్నంతవరకు ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఉంటుంది..గద్దర్ అన్నతో నాకు వ్యక్తిగతంగా ఎంతో సాన్నిహిత్యం ఉంది..నాలాంటి వారికి ఉద్యమ స్ఫూర్తిని నింపిన కవి, కళాకారుడు ఆయన అని రేవంత్ రెడ్డి అన్నారు.తుది దశ తెలంగాణ ఉద్యమం కోసం చివరి శ్వాస వరకు పరితపించారు..దొరల నుంచి తెలంగాణను కాపాడాలని తుది దశ ఉద్యమానికి అండగా నిలబడ్డారు..రాహుల్ కు గద్దర్ అన్న పెట్టిన ముద్దు ఇంకా తడి ఆరలేదు..ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవడం బాధాకరం..అని రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. గద్దరన్న అంతిమ యాత్ర రేపు 11 గంటలకు మొదలవుతుంది..ఎల్బీ స్టేడియం నుండి బషీర్ బాగ్ చౌరస్తా, జగ్జీవన్ రామ్ విగ్రహం మీదుగా గన్ పార్క్ వైపు సాగుతుంది…గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద గద్దర్ పార్థీవ దేహాన్ని ఉంచి పాటలతో నివాళులు అర్పిస్తారు..అమరవీరుల స్థూపం నుండి భూదేవినగర్ లోని గద్దర్ నివాసానికి పార్థివదేహం చేరుకుంటుంది..భూదేవినగర్ లోని మహాభారతి విద్యాలయం అవరణలో గద్దర్ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు చెప్పారు..అంత్యక్రియలకు వేలాదిగా తరలివచ్చి గద్దర్ కు నివాళులు అర్పించండి..తుది దశ ఉద్యమానికి ఆయన ఇచ్చిన స్ఫూర్తిని నింపుకుని ఆయన కలలు కన్న తెలంగాణకై పోరాడదాం..అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.