‘‘మంకీపాక్స్, కాంగో ఫీవర్ సమాజాన్ని కలవరపెడుతున్నాయి. కొరోనా కష్ట కాలంలో తీసుకున్న జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలి. తద్వారా మన కుటుంబాలతో పాటు ఇతరులకూ వ్యాధి సోకకుండా చూసిన వాళ్ళం అవుతాము. మన వివరాలనూ వైద్యాధికారులకూ తెలియజేయాలి. ఆపత్కాలంలో ధైర్యంగా ఉండాలి. సామాజిక స్పృహతో బాధ్యతగా మెలగాలి. అప్పుడే సాంక్రమిక వ్యాధుల బారి నుంచి తప్పించు కోగలం.’’
వ్యాధులు, కరువు, యుద్ధాలు, వాతావరణ మార్పులు, అసమానతలు, భౌగోళిక రాజకీయ శత్రుత్వాలు ప్రపంచ మానవాళికి పెను సవాళ్లుగా మారాయి. ప్రపంచానికి కోవిడ్ ఒక్కటే సంక్షోభం కాదు. ఇరాక్ లో విజృంభిస్తున్న కాంగో ఫీవర్, బ్రిటన్ లో మొదలై..ఇతర దేశాలకు వేగంగా వ్యాపిస్తున్న మంకీపాక్స్, కాంగొలో ఎబోలా, కారణాలు తెలీకుండా వ్యాప్తిస్తున్న హెపటైటిస్, అఫ్గానిస్తాన్, ఇథియోపియా, సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియన్ అరబ్ రిపబ్లిక్, యుక్రెయిన్, యెమెన్‌లలో మానవతా సంక్షోభం.. ఇవన్నీ కొత్త సవాళ్లు విసురుతున్నాయి.
వీటన్నింటికీ మూలం మనుషుల ఆలోచనలు, చర్యలే. 20019లో చైనా దేశంలోని వూహాన్ లో వెలుగు చూసిన కొరోనా మమమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. లక్షల మంది చనిపోయారు. కొరోనా వైరస్ ..ఒకపెద్ద వైరస్ ల కుటుంబం. సాధారణ జలుబు మొదలుకొని, అత్యంత తీవ్రమైన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(%వీజు=•%), మరియు సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (%••=•%) లను కలిగిస్తాయి. రకరకాల మ్యూటేషన్లతో కొరోనా ప్రజలను భయపెట్టింది. ఆప్తులను బలిగొంది.

కొరోనా సృష్టించిన విలయం నుండి పూర్తిగా కోలుకోకముందే… మంకీ పాక్స్ వచ్చి పడింది. మే 7 న బ్రిటన్ దేశంలో వెలుగుచూసిన ఈ వైరస్ ఇపుడు 45 దేశాలకు విస్తరించింది. జ్వరం, శరీరంపై దద్దుర్లు, పొక్కులు మంకీ పాక్స్ వ్యాధి లక్షణాలు. మశూచి లా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. 21 రోజుల పాటు హోమ్ ఇసోలేషన్ లో ఉంటే చాలని డాక్టర్లు చెప్తున్నారు. పొక్కులు మానిపోయి, కొత్త చర్మ వచ్చేవరకూ ఎవరిని కలవకూడదు అని సూచిస్తున్నారు. ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు ఇప్పటి వరకు. మశూచి కి ఇస్తున్న ట్రీట్మెంట్ ఇస్తున్నారు. మనదేశంలో మంకీపాక్స్ కేసులు బయటపడలేదు కానీ కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
మంకీపాక్స్ భయంలో వుండగానే ఇరాక్ దేశంలో కాంగో వైరస్ ఉనికిలోకి వచ్చింది. ఈ వైరస్ 1979లో మొదటిసారిగా ఇరాక్ లోనే కనిపించింది. మళ్ళీ 43 ఏళ్లకు తాజాగా వైరస్ విజృంభిస్తున్నది. పొరుగు దేశాలకు పాకే ప్రమాదమూ ఉంది. ఇప్పుడు ఇరాక్ దేశస్తులు మాంసం తినడానికి భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
మన జుట్టులో ఉండే పేలలో ఉండే నైరో వైరస్ వల్ల కాంగో ఫీవర్ వ్యాప్తి చెందుతుంది. పశువుల ఈ వైరస్ ఉన్నా.. ఈ వైరస్ ఉన్న పేలు కుట్టినా ఇది సోకుతుంది. తలనొప్పి, జ్వరం, వాంతులు, విరోచనాలు, శ్వాస సమస్యలు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. దీనిని ప్రాణాంతక వైరస్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలను హెచ్చరించింది.
ప్రస్తుతం ఇరాక్ దేశంలో ఈ వ్యాధి సోకిన పశువులను వాటి పేలను సేకరించి పరిశోధన చేస్తున్నారు. అలాగే ఇది వ్యాప్తి చెందకుండా పురుగు మందులను పిచికారి చేస్తున్నారు. ఇది చాలా త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్న కారణంగా రక్షణ కిట్లను ధరించి మరీ కాంగో ఫీవర్ నియంత్రణకు ఇరాక్ దేశంలో ఆరోగ్య సిబ్బంది చర్యలు చేపట్టారు.

ఇరాక్ దేశంలో 111 కాంగో ఫీవర్ కేసులు నమోదు కాగా వారిలో 19 మంది మరణించడం కలకలం రేపుతోంది. ఈ వైరస్ కు కూడా వ్యాక్సిన్ లేదు. ఇక ఈ వైరస్ బారిన పడిన వారికి ముక్కు నుంచి తీవ్రమైన రక్తస్రావం అవుతోంది.. దీంతో కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారు భయకంపితులు అవుతున్నారు. ఈ వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మంకీపాక్స్, కాంగో ఫీవర్ సమాజాన్ని కలవరపెడుతున్నాయి. కొరోనా కష్ట కాలంలో తీసుకున్న జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలి. తద్వారా మన కుటుంబాలతో పాటు ఇతరులకూ వ్యాధి సోకకుండా చూసిన వాళ్ళం అవుతాము. మన వివరాలనూ వైద్యాధికారులకూ తెలియజేయాలి. ఆపత్కాలంలో ధైర్యంగా ఉండాలి. సామాజిక స్పృహతో బాధ్యతగా మెలగాలి. అప్పుడే సాంక్రమిక వ్యాధుల బారి నుంచి తప్పించు కోగలం.
వంగ మహేందర్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్