దేశానికి గుదిబండగా మోదీ ద్వయం
దేశాన్ని అప్పులకుప్పగా మార్చి అనుయాయులకు పంపకం
రూ.183 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత
పరివారాన్ని కాపాడుకునే పనిలోనే మోదీ
ఇడి కార్యాలయం ముందు సిఎం రేవంత్ ధర్నా
బిజెపి విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు
బిఆర్‌ఎస్ ఉచ్చులో పడొద్దని రైతులకు సిఎం రేవంత్ సూచన
అందరికీ రుణమాఫీ చేస్తామని హామీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 : అదానీ వ్యవహారాన్ని చట్టసభల్లో రాహుల్ గాంధీ బయటపెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకుని కొందరికే లబ్ది చేకూరేలా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్‌షా విధానాలకు నిరసనగా దేశంలోని అన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ గురువారం ఆందోళనలు నిర్వహించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో సీఎం పాల్గొని మాట్లాడుతూ…దేశానికి రూ.183 లక్షల కోట్ల అప్పులున్నాయని, 16 మంది ప్రధానులు చేసిన అప్పుల కంటే నరేంద్ర మోదీ రెండింతలు ఎక్కువ అప్పులు చేశారని విమర్శించారు. మోదీ తన పరివారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, దేశాన్ని మోదీ, అమిత్‌షా, అదానీ, అంబానీ చెరబట్టారని దుయ్యబట్టారు. సెబీ ఛైర్‌పర్సన్ అక్రమాలపై విచారణ జరపాలని రేవంత్ డిమాండ్ చేశారు. వర్సిటీలు, ప్రాజెక్టులను మొదలుపెట్టిన దార్శనిక ప్రధాని నెహ్రూ అని, ఇందిరా గాంధీ భూసంస్కరణలు ప్రవేశపెట్టి బలహీనవర్గాలకు భూములు పంచారని, రాజీవ్ గాంధీ తెచ్చిన సాంకేతిక విప్లవం వల్లే ఐటీ అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు.
ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ తమ ప్రియారిటీగా నెహ్రు పరిపాలన సాగించారని, బ్యాంకులను రైతుల కోసం ఇందిరాగాంధీ జాతీయం చేశారని అన్నారు. పేదలకు భూములు ఇచ్చి ఇందిరాగాంధీ వారి ఆత్మగౌరవం పెంచారని, ఇక రాజీవ్ గాంధీ సాంకేతిక రంగాన్ని పెంచి పోషించారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవం తేగా, పీవీ లాంటి ప్రధానులు దేశం కోసం ప్రణాళికలు రచించి దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. స్వతంత్ర పోరాటం కోసం గుజరాత్ నుండి గాంధీ.. వల్లభాయ్ పటేల్ బయలుదేరారని, అదే గుజరాత్ నుండి.. మోదీ.. అమిత్ షా లు బయలు దేరారని, ఆ ఇద్దరినీ చూస్తే దేశం గర్విస్తుండగా…ఈ ఇద్దరు దేశం సంపద లూటీ చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ సన్నాసులు ఈ విషయంలో బీజేపీని ఎందుకు నిలదీయడం లేదని రేవంత్ ప్రశ్నించారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అవుతుందో.. మలినం అవుతుందో వాళ్ళ ఇష్టమని విమర్శిస్తూ.. కేసీఆర్ బీజేపీ దోపిడీ వి•ద ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కెటిఆర్‌ను ఉద్దేశించి ట్విట్టర్ టిల్లు ఎందుకు మాట్లాడడడని ప్రశ్నిస్తూ.. బీజేపీకి అనుకూలం కాబట్టే ఆయన స్పందించరన్నారు.
జేసీసీ విషయంలో బీఆర్‌ఎస్ విధానం ఏంటని ప్రశ్నించారు. అమిత్ షా.. మోదీని మెప్పించడానికి రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్త అంటున్నారని, ఎయిర్ పోర్ట్‌కి రాజీవ్ గాంధీ పేరు మారుస్తామంటున్నారని, చెయ్యి వేసి చూడాలని, వీపు పగలకొట్టక పోతే తాను పేరు మార్చుకుంటానన్నారు. తెలంగాణకి తల్లి సోనియా గాంధీ అన్నారు. సచివాలయం బయట కాదు.. లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని, పదేళ్లు ఈ సన్నాసులు ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదని రేవంత్ ప్రశ్నించారు. రైతుల ముసుగులో బీఆర్‌ఎస్ ధర్నాలు చేస్తుందని మండిపడ్డారు. ఏ రైతుకు మాఫీ కాకున్నా..కలక్టర్ కార్యాలయంలో కౌంటర్ పెట్టినమని, 18 వేల కోట్లు రైతుల ఖాతాలో వేశామని, కేటీఆర్ తప్పుడు మాటలు మానుకోవాలని, తమది ప్రజా పాలన అని, రైతులకు..ప్రజలకు అందుబాటులో ఉన్నామని రేవంత్ తెలిపారు. రోజూ తాము 18 గంటలు ప్రజల మధ్యనే ఉంటున్నామని, వారికి ధర్నా చేయాల్సిన అవసరం ఏముందని, వారే ప్రజల్ని పట్టించుకోకుండా ఉన్నారన్నారు. కాకుల లెక్క.. గద్దల లెక్క పిక్కుతున్నది వాళ్లే కదా అంటూ విమర్శించారు. కేటీఆర్..హరీష్ లాంటి సన్నాసులు కదా రైతుల్ని దోచుకుందని, వాళ్ళు రైతుల్ని మోసం చేయడానికి వొస్తున్నారన్నారు.
పదేళ్లలో వారు ఎంత మాఫీ చేశారంటూ ప్రశ్నించారు. తాము ఎంత చేశామో చర్చకు సిద్దమని, తదపర్టి తమ జగ్గన్ననే చూసుకుంటారన్నారు. సోషల్ వి•డియాని నమ్ముకున్న మోదీ ఏమయ్యారో..వారు అంతే ఐతరని, 400 గెలుస్త అని మోదీ ప్రచారం చేసుకుంటే ఏమైందో తెలుసునని, వొచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు 39 లో 9 కూడా రావని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక రూ.2 లక్షల రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం వందశాతం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి మరోపారి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ సన్నాసుల మాటలు నమ్ముకుని రైతులు ఆగం కావద్దని సూచించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కొన్ని సాంకేతిక కారణాలతో కొందరికి మాత్రమే రుణాలు మాఫీ జరగలేదని, త్వరలోనే పూర్తిగా రుణాలు మాఫీ అవుతాయని పేర్కొన్నారు. ఏ ఒక్కరికి రుణం మాఫీ కాకపోయినా.. ఇక్కడ తాము ఉన్నామన్న విషయాన్ని మర్చిపోవద్దని కోరారు. ఏ రైతుకి రుణమాఫీ రాకపోయినా గామున్నామని, కలెక్టర్ ఆఫీసుల్లో కుర్చీ వేసి ఆఫీసర్లను కూర్చోబెట్టామని, రైతు విషయంలో కొందరు దొంగ దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
రైతులకు రోడ్డెక్కాల్సిన బాధ ఏమొచ్చిందని ప్రశ్నిస్తూ.. సన్నాసులను నమ్ముకుని ఆగం కావొద్దని రైతులకు రేవంత్ సూచించారు. రైతుల సమస్యలు విననప్పుడు ధర్నాలు చేయాలని, వారి సమస్యలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తొందర పడొద్దని కర్షక సోదరులను కోరుతున్నానని, రైతుల సమస్యను ప్రభుత్వం వింటుందని తెలిపారు. పదేళ్లు దోచుకున్న వాళ్లను, ఆరునెలల కింద బొంద పెట్టిన వారిని మళ్ళీ గ్రామాల్లోకి ఎందుకు రానిస్తున్నారన్నారు. రుణమాఫీ హావి• అమలు చేయడంతో హరీష్ తన పదవికి రాజీనామా చేయాల్సి వొస్తుందని ఇవాళ కొత్త డ్రామా మొదలు పెట్టారని రేవంత్ మండిపడ్డారు. డ్రామాలో భాగంగానే దేవాలయాల వద్ద నిరసనలు చేస్తున్నారని, బీఆర్‌ఎస్ నాయకులు సోషల్ వి•డియాలో అబద్దాలను ప్రచారం చేస్తున్నారని, వారిపట్ల ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు. రుణమాఫీ చేయడంతో బీఆర్‌ఎస్ నేతలకు ఏం చేయాలో పాలుపోవట్లేదని, దాంతో అబద్దాలకు తెరతీశారన్నారు. కేటీ రామారావు రుణమాఫీ విషయంలో పచ్చి అబద్దాలు చెబుతున్నారని, వారు రూ.లక్ష రుణం మాఫీ చేయడానికే ఆపసోపాలు పడ్డారని, అప్పటికీ అందరికీ పూర్తి చేయలేదని, కానీ తాము ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణాలను మాఫీ చేశామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.