టిజెఎస్ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్
నల్లగొండ, ప్రజాతంత్ర, మే 6 : కృష్ణా బోర్డ్ సమావేశంలో తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలని టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ డిమాండ్ చేశారు. కృష్ణా నది కింద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సందర్భంగా కోదండరామ్ నార్కట్‌పల్లిలో డియాతో మాట్లాడుతూ…శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఉన్న 15 ఔట్ లెట్స్ కావాలని అడుగుతున్నారని, ఆర్డీఎస్ 15.9 టీఎంసీలు రావాల్సి ఉందన్నారు.
కానీ సగం కూడా రావడం లేదన్నారు. తెలంగాణకు 811 టీఎంసీలకు గాను 299 టీఎంసీలు కేటాయిస్తూ తాత్కాలిక కేటాయింపు ఇస్తున్నారని విమర్శించారు. ఇకపోతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని కోదండరామ్ ప్రభుత్వాన్ని కోరారు.