ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చిన విద్యుత్ రంగం

ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చిన విద్యుత్ రంగం

రూ.97,321 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలు పటిష్ఠం
2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 2700 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ లోటు వుండేది.60 ఏo డ్ల సమైక్య పాలనలో వివక్షా పూరితంగా మన బొగ్గు, నీటిని అక్రమంగా తరలించి ఇతర ప్రాంతాల్లో  విద్యుత్ ప్లాంట్లు నిర్మించారు. తెలంగాణ ఏర్పడే నాటికి 7778  మెగావాట్ల మేరకే ఉన్న విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ప్లాం ట్ల నిర్మాణం జరిగింది. తలసరి  విద్యుత్ వినియోగం 1196 కిలోవాట్ లుమాత్రమే ఉండేది. డిమాండుకు తగ్గట్టుగా విద్యుత్ సబ్ స్టేషన్లు, లైన్ల నిర్మాణం చేపట్టలేదు.  అరకొర కరెంటుతో  నిత్యం వ్యవసాయ మోటార్లు , ట్రాన్స్ ఫార్మ ర్లు కాలిపో వుట వలన ఎండిన పంటలతో రైతులు రోడ్డెక్కారు.విద్యుత్ కోతల తో  వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్ తీవ్రంగా దెబ్బతిన్నది.
పవర్ హాలిడేస్ తో   పరిశ్రమలు మూతపడ్డాయి. దీనితో మనుగడకొరకు రైతులు, శ్రామికులు వలసబాట పట్టినారు.ఇది ఒకప్పటి పరిస్తితి. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దార్శనికత, పాలనా దక్షత కు గత 9 సంవత్సరాల స్వల్ప కాలంలో విద్యుత్ రంగం సాధించిన ప్రగతే నిదర్శనంగా నిలుస్తోంది.  పూర్తిగా నిర్లక్ష్యం, వివక్షతకు గురైన విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థ లను విస్తరించి , పటిష్ట పరిచేందుకు రూ.97,321 కోట్ల ను ఈ 9 ఏoడ్ల లో తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది.  విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని 7778 మెగావాట్ల నుండి 18567 మెగావాట్లకి పెంచడం జరిగింది.9  ఏoడ్లలో అదనంగా  10,789    మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది.
థర్మల్ లో 5156 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం, సోలార్ విద్యుత్ లో 5273 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని అదనంగా పెంచడం జరిగింది. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన 600 మెగావాట్ల సామర్థ్యం గల కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ , 6X40 MW లోయర్ జూరాల & 4X 30 MW పులిచింతల జలవిద్యుత్ కేంద్రాల ను యుద్ధ ప్రాిపదికన ప్రభుత్వం పూర్తి చేయించింది. దేశంలోనే రికార్డు సమయం 48 నెలల్లో KTPS 7 వ దశలో 800 MW Super Critical థర్మల్ కేంద్రాన్ని నిర్మించింది. దేశంలోనే తొలసారిగా ప్రభుత్వ రంగంలో  నల్గొండ జిల్లా దామరచర్ల లో రూ.34,400 కోట్ల పెట్టబడితో  5X500 MW సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.2023 చివరినాటికి మొదటి యూనిట్ లో ఉత్పత్తి అందుబాటులోకి రానున్నది.సాధించిన ఉత్పత్తి సామర్థ్యాన్ని విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థ లను ప్రభుత్వం పటిష్ట పరిచింది. పరిమితంగా ఉన్న 400 kv, 220 కేవీ, 132 kv విద్యుత్ ట్రాన్స్ ఫార్మా ర్ల తో పాటు హై టెన్షన్ లైన్ల పొడవును  గణనీయంగా పెంచింది.
image.png
 విద్యుత్ సరఫరా వ్యవస్థ సామర్ధ్యాన్ని 39,345 MVA కు పెంచడం జరిగింది.  33 kv, 11 kv సబ్ స్టేషన్లు తో పాటు లో టెన్షన్ విద్యుత్ పంపిణీ లైన్ల ను భారీగా విస్తరించారు . అన్ని రంగాలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ ను అభివృద్ధి చేసి దేశంలో అత్యుత్తమ విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఇటువంటి వ్యవస్థ ఉండుట వలన 2023 మార్చి లో 15,497 మెగావాట్ల కు చేరిన  అత్యధిక విద్యుత్ డిమాండును సైతం తట్టుకోవడం జరిగింది. గ్రిడ్ విఫలమైన సందర్భాల్లో కూడా హైదరాబాద్ నగరానికి విద్యుత్ సరఫరా లో అంతరాలను అధిగమించుటకు ఐలాండ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అంతే కాకుండా హైదరాబాద్ మహా నగరంలో విద్యుత్ అంతరాలు  నివారించుటకు 400 kv, 220kv, 132 kv స్థాయిలలో ఆధునిక “రింగ్ మెయిన్ సిస్టమ్స్” ను నెలకొల్పారు.
image.png
నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా తో తెలంగాణ వ్యవసాయ రంగం లో స్వర్ణయుగం ఆవిర్భవించింది.ఈ 9 ఏ o డ్ల కాలంలో  8.46 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ను అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనితో 2014 నాటికి 19.03 లక్షలు ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు సంఖ్య 27.49 లక్షలకు పెరిగింది. అన్ని రంగాలకు కలిపి అదనంగా 67 లక్షల విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇవ్వటం జరిగింది. దీనితో మొత్తం విద్యుత్ కనెక్షన్లు సంఖ్య 1 కోటి 78 లక్షలకు పెరిగాయి.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి జీవనాడి లాంటి విద్యుత్ రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది.60 ఏoడ్ల సమైక్య పాలనలో జరిగిన వివక్షకు చరమగీతం పడింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సబ్ స్టేషన్లు, సరఫరా లైన్ల నిర్మాణంతో తలసరి విద్యుత్ వినియోగంలో జాతీయ సగటు ( 1255 యూనిట్ల) కంటే 70 % ఎక్కువతో 2140 యూనిట్ల సగటుతో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతున్నది. మన వనరులు.. మన పాలన.. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దార్శనికత పాలన కు విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతి తార్కాణంగా నిలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page