జూన్ 1న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు ఐఎండి వెల్లడి
న్యూ దిల్లీ, ఏప్రిల్ 14 : ఈ ఏడాది కూడా దేశంలోని చాలా ప్రాంతంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) గురువారం తెలిపింది. జూన్ 1న కేరళలో నైరుతి రుతుపవనాల ప్రారంభం తర్వాత ఉత్తర, మధ్య భారత్‌లోని చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుంది.
ఈశాన్య, వాయువ్య, అలాగే దక్షిణ ద్వీపకల్పంలోని దక్షిణ భాగాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 2021లో కూడా నైరుతి రుతుకాలమైన జూన్ నుండి సెప్టెంబర్ వరకు దేశంలో సాధారణ వర్షపాతమే నమోదైంది. సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం ఇదే వరుసగా మూడో సంవత్సరం.