ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి వెల్లడి
ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 30 : పెరిగిన సెస్ చార్జీలతో ప్రభుత్వానికి ఏలాంటి సంబందం లేదని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. అవి ఆర్టీసీ చార్జీల పెంపు కాదని సెస్ చార్జీలు మాత్రమేనని.. భవిష్యత్తులో ఆర్టీసీ చార్జీలు ఇంకా పెరుగుతాయని తెలిపారు.
టోల్ ప్లాజా డబ్బులు టీఎస్‌ఆర్టీసీ చెల్లిస్తుందన్నారు. ఏటా 70 నుండి 100 కోట్లు ఆర్టీసీ ద్వారి నష్టపోతున్నామని తెలిపారు. ఆర్టీసీ లాభాల కోసమే చార్జీల పెంపు అని చెప్పుకొచ్చారు. ఇంత చేసిన రోజు 6 కోట్ల రూపాయల నష్టపోతున్నామన్నారు. కొత్త బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు.