అలిపిరి నడక మార్గంలో గ్రీన్‌ ‌కార్పెట్‌..!

  • ‌భక్తుల ఇబ్బందులు చూసి చలించిన టీటీడీ చైర్మన్‌ ‌వైవి సుబ్బారెడ్డి
  • 24 గంటల్లో భక్తుల కాళ్ళు కాలకుండా గ్రీన్‌ ‌కార్పెట్‌
  • ‌చైర్మన్‌ ‌సత్వర స్పందనపై భక్తుల కృతజ్ఞతలు

తిరుమల, జూన్‌ 4 : అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే భక్తులు ఎండ వేడితో కాళ్ళు కాలుతూ పడుతున్న ఇబ్బందులు చూసి టీటీడీ చైర్మన్‌ ‌శ్రీ వైవి సుబ్బారెడ్డి చలించి పోయారు. భక్తులు కాళ్ళు కాలకుండా ఉండటం కోసం యుద్ధప్రాతిపదికన గ్రీన్‌ ‌కార్పెట్‌ ఏర్పాటు చేయించారు.వివరాలు ఇలా ఉన్నాయి. చైర్మన్‌ ‌శ్రీ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న సమయంలో నడక దారిలోని మోకాలి మిట్ట నుంచి అక్కగార్ల గుడివరకు భక్తులు కాళ్ళు కాలుతూ పడుతున్న ఇబ్బందులను చూసి చలించారు. భక్తులతో మాట్లాడి వారి ఇబ్బందిని తెలుసు కున్నారు. నడక మార్గం లోని మోకాలి మిట్ట నుంచి అక్కగార్ల గుడి మలుపు వరకు వెంటనే గ్రీన్‌ ‌మ్యాట్‌ ‌వేయించి నీరు చెల్లించే ఏర్పాటు చేయాలని చీఫ్‌ ఇం‌జినీరింగ్‌ ‌నాగేశ్వరరావును ఆదేశించారు.

24 గంటల్లో పని పూర్తి చేసి తనకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. చైర్మన్‌ ‌వైవి సుబ్బారెడ్డి ఆదేశం మేరకు ఇంజినీరింగ్‌ అధికారులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయానికి ఈ మార్గంలో గ్రీన్‌ ‌కార్పెట్‌ ఏర్పాటు చేసి దాని మీద నీళ్లు చెల్లించే ఏర్పాటు చేశారు. తమ ఇబ్బందిని గమనించి వెంటనే స్పందించి తగిన ఏర్పాటు చేయించడం పట్ల భక్తులు టీటీడీ చైర్మన్‌ ‌వైవి సుబ్బారెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా చైర్మన్‌ ‌సుబ్బారెడ్డి మాట్లాడుతూ, సామాన్య భక్తుల సదుపాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు. వేసవిలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో నడక మార్గాలు, తిరుమలలో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page