రోజు అంటే…
రేయింబవళ్ళ చలనమే!
సంవత్సరము అంటే
రెండు ఆయనాల ఆవృతమే!
దారికి తెలియని గమ్యం
రెండు పాదాల గమనమే!
పగలు – రేయికి రాజులు
ఆ సూర్య – చంద్రులే!
కారు చీకటి మబ్బుల్లో
మిలమిల మెరుపుల ఉరుములే!
వినీలాకాశానికి అందం
మిలమిల మెరిసే తారక లే!
జీవులు పుట్టుట- గిట్టుట
పెరిగి -విరుగుట దేహాల ధర్మమే!
పంచభూతాలు జీవులకు వరమే!
గంట లో దాగిన శబ్దం
నాలుక ఆడిస్తే ధ్వనించే నిశ్శబ్దమే!
దర్శించే కన్నులు రెండైనా
దర్శించే దృశ్యం ఒకటే!
సృష్టి చిత్ర -విచిత్రంగా కనిపించినా
అది అర్ధాల ఏకమే!
– పి.బక్కారెడ్డి, 9705315250

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page