- సిద్దిపేట సద్దిమూట…హరీష్ రావు
- నిత్యం 3 వేల మంది ఆకలి తీరుస్తున్న మంత్రి
- ఎక్కడ చూసిన కడుపు నిండా అన్నం
- రైతు బజార్‌లో..హాస్పిటల్‌లో..నిరుద్యోగుల ఉచిత శిక్షణా
- బిరాల్లో..గ్రంథాలయంలో..క్యాంపు కార్యాలయంలో.. మంత్రి హరీష్ రావు చొరవతో ఆకలి తీర్చే భోజనామృతం
- సిద్దిపేట ప్రజలు ఆకలితో అలమటించొద్దన్నదే ఆలోచన
సిద్దిపేట, మే 2(ప్రజాతంత్ర బ్యూరో) : మంత్రి తన్నీరు హరీష్ రావు అంటే అభివృద్ధి నాయకుడు, సంక్షేమ సాధకుడు, ఆపదలో ఆదుకొనే ఆపద్భాందవుడు, ఆర్థిక భరోసానిచ్చే…మానవత్వం చాటుకొనే మానవతా మూర్తిగా విన్నాం..చూశాం. ఇవే కాదు సిద్దిపేట ప్రజలు…సిద్ధిపేటకు వొచ్చే ప్రజలు ఆకలితో అలమటించొద్దు…అనే ఆలోచనతో సిద్ధిపేటలో ఉచిత బోజన కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిత్యం అందుబాటులోనే కాదు..నిత్యం అన్నం పెట్టాలి అనే తపన.. ఆలోచనతో ఎక్కడ అవసరం పడితే అక్కడ ప్రజల ఆకలి తీరుస్తూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్నదానం అంటే దేవాలయంలో ఎదో ఒక వారం.. గణపతి, అమ్మవారి ఉత్సవాల్లో ఒక రోజు.. హనుమాన్ బిక్ష కార్యక్రమంలో 41 రోజులు..21 రోజులు. కానీ సిద్దిపేటలో అభివృద్ధి…సంక్షేమం..ప్రజా అవసరాలు ఓ వైపు చేస్తూ..ప్రజల ఆకలి తీర్చే అన్నదాతగా మంత్రి హరీష్ రావు ప్రజల మనసును దోచుకొన్న గొప్ప మానవతా మూర్తిగా నిలుస్తున్నారు.
అన్నదాత సుఖీభవ..
సిద్దిపేటలో ఎక్కడిక వెళ్లినా ఆకలి బాధ లేదు…మా కడుపు నింపుతున్న హరీష్ రావు సర్ కడుపు సల్లంగా ఉండాలి…అన్నదాత సుఖీభవ అంటూ ఇక్కడి ప్రజలు ఎక్కడికి వెళ్లినా కడుపు నింపేందుకు మంత్రి హరీష్ రావు సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన భోజనం ప్రతి రోజు దాదాపు 300 మంది ప్రజలు చుట్టూ ప్రక్కల నుండి వొచ్చే ప్రజలకు, సిద్దిపేట ప్రజలకు ఆకలి సేద తీర్చే విధంగా ఎంతో ఉపయోగ పడుతుంది. సిద్దిపేట సద్దిమూటగా మార్కెట్‌లో ధాన్యం కొనుగోలుకి వొచ్చే రైతుల ఆకలి తీర్చే విధంగా కొనుగోలు సమయంలో 300 మందికి పైగా భోజనం పెట్టి హారీష్ రావు రైతులకు సద్దిమూట అయ్యాడు. హాస్పిటల్‌లో దాదాపు కొన్ని ఏళ్ల నుండి పేషంట్స్‌కి, వారి కుటుంబాలకు ప్రతి నిత్యం అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్నారు. రైతు బజార్‌కు వొచ్చే రైతులు పొద్దుగాలనే వొచ్చి పొద్దువూకే వరకు ఆకలితో కడుపు మాడ్చుకోవద్దనే ఆలోచనతో సిద్దిపేట రైతు బజార్‌లో భోజనం ఏర్పాటు చేశారు.
ఏ సమస్య ఉన్న… ఏ పని ఉన్న సమస్యలను పరిష్కరించడం.. పని చేయడంతో పాటు కడుపు నిండా అన్నం పెట్టాలని మంత్రి క్యాంపు కార్యాలయంకు వొచే ప్రజలకు కూడా బోజనం పెట్టిస్తున్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో నిరుద్యోగ యువకులు, గ్రంథాలయంకి వొచ్చే పాఠకులకు మంచి పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌తో పాటు మంచి భోజనం ఏర్పాటు చేశారు. సిద్ధిపేటలో నిర్వహిస్తున్న ఉచిత టెట్, కానిస్టేబుల్ శిక్షణ శిబిరాల్లో మంచి బోధనతో పాటు మంచి భోజనం పెట్టిస్తున్నారు. ఇలా ఎక్కడికి వెళ్లినా ఈ సమయంలో దాదాపు 3వేల మందికి ఆకలి తీర్చే అన్నదాతగా గొప్ప ఔదార్యం చాటుకుంటున్న మంత్రి హరీష్ రావు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని…మా కడుపు నింపే సారు కడుపు సల్లగా ఉండాలని కోరుకుంటున్నారు సిద్దిపేట ప్రజానీకం.