అకృత్యాలు తెలుసుకునేందుకే రాహుల్‌ ‌పర్యటన

కెటిఆర్‌, ‌కవితల ట్వీట్లకు రేవంత్‌ ‌ఘాటు స్పందన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 6 : కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ రాష్ట్ర పర్యటనపై మంత్రి కేటీఆర్‌ ‌వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కౌంటర్‌గా ట్వీట్టర్‌ ‌వేదికగా స్పందిస్తూ…‘ పాలనపై ఏం అధ్యయనం చేయాలి కేటీఆర్‌. ‌రుణమాఫీ హా ఎలా ఎగ్గొట్టాలి? ఎరువుల ఫ్రీ హాని ఎలా అటకెక్కించాలి?. మోదీ ముందు మోకరిల్లి రైతులకు ఉరితాళ్లు ఎలా బిగించాలి?. వరి, మిర్చీ, పత్తి రైతులు ఎలా చస్తున్నారు?.. ఇవే కదా నిజాలు. ఆ నిజాలు మరింత గట్టిగా చెప్పాడానికే రాహుల్‌ ‌వొస్తున్నారని అంటూ రేవంత్‌రెడ్డి ట్వీట్‌ ‌చేశారు. రాష్ట్రంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనపై మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ట్విటర్‌ ‌వేదికగా స్పందించిన రేవంత్‌.. ఇద్దరికీ పలు ప్రశ్నలు సంధించారు.

తెలంగాణ పాలనపై అధ్యయనం చేసేందుకు వొస్తున్న రాహుల్‌ ‌గాంధీకి స్వాగతం అంటూ ట్వీట్‌ ‌చేసిన మంత్రి కేటీఆర్‌కు తనదైన శైలిలో కౌంటర్‌వేశారు. మరోవైపు పలు ప్రశ్నలతో ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు తాము ఎక్కడ ఉన్నారంటూ.. రేవంత్‌ ‌ప్రశ్నలు సంధించారు.  తండ్రి మోదీ ముందు మోకరిల్లి తెలంగాణ నుంచి ఇకపై బాయిల్డ్ ‌రైస్‌ ఇవ్వబోమని లేఖ రాసి రైతులకు ఉరితాళ్లు బిగించినప్పుడు రు ఎక్కడ ఉన్నారు..? వరి వేస్తే ఉరే అని  తండ్రి ప్రవచనాలు చెప్పి ఆయన ఫాంహౌస్‌లో 150 ఎకరాల్లో వరి పంట వేసినప్పుడు రేం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌, ‌ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిరప రైతులు పిట్టల్లా రాలిపోతుంటే ఎక్కడ ఉన్నారు. రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని  తండ్రి పచ్చి మోసానికి ఒడిగడితే ప్రశ్నించాల్సిన రెక్కడ ఉన్నారు..?

రాష్ట్రంలో రైతులకు అవసరమైన 26 లక్షల టన్నుల ఎరువులు ఉచితంగా ఇస్తామని  తండ్రి చెప్పి ఐదేళ్లవుతున్నా.. అర క్వింటాల్‌ ఎరువులు కూడా ఇవ్వలేదు.. అప్పుడు రెక్కడ ఉన్నారు…? అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం రాశులు తడిచి రైతులు బోరున విలపిస్తున్నారు… వారి కష్టం పట్టించుకోకుండా రెక్కడ ఉన్నారు..?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో భాజపాతో కలిసి డ్రామాలాడి ఆలస్యం చేయడం వల్ల చాలా మంది రైతులు ఇప్పటికే మద్దతు ధర కంటే చాలా తక్కువగా 1400 రూపాయలలోపే అమ్ముంటున్నారని రేవంత్‌? ఆక్షేపించారు. గడిచిన ఎనిమిదేళ్లుగా తెరాస పంచన చేరి… తెలంగాణను వంచన చేశారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం హక్కుగా రావాల్సిన కోచ్‌ ‌ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం లాంటివి ఏ ఒక్కటీ తెరాస సాధించలేదని రేవంత్‌ ‌దుయ్యబట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page