బిజెపి అంటే కార్మికుల వ్యతిరేక పార్టీ..
కనీస వేతన సవరణ కచ్చితంగా చేస్తాం
కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనం లో మంత్రి హరీష్ రావు
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 14: గతంలో జీతాలు పెంచాలని ధర్నా చేస్తే ఇనుప బూట్లు, గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.. కానీ కార్మికుల సమస్యలేంటో తెలుసుకొని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు పెంచిన చరిత్ర కేసీఆర్‌ది..అని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం నిర్వహించిన 44 కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ..ఆటో కార్మికులకు త్రైమాసిక పన్నును రద్దు చేసింది కేసీఆర్..ట్రాక్టర్లకు పన్ను రద్దు చేసింది కూడా కేసీఆరే..ఆటో కార్మికులకు, రవాణా కార్మికుల ట్రాన్స్పోర్ట్ బోర్డు ఏర్పాటు డిమాండుని మూడోసారి అధికారంలోకి రాగానే నెరవేరుస్తామన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ని గెలిపిస్తే ఆర్పీలు, వీఏవోల జీతాన్ని రెట్టింపు చేస్తామని పేర్కొంటూ ..కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఉద్యోగుల జీతాలు ఎక్కువ..కార్మికుల ఉసురుపోసుకున్న పార్టీ బీజేపీ. రైల్వేలు, రైల్వే లైన్లు, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీలను అమ్మేశారు..అమ్ముడు తప్ప కొత్తగా కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టడం బీజేపీకి తెలియదు..కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు తుస్సయిపోయినయి..రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు చాలు అంటున్నడు, కర్ణాటక డిప్యూటీ సీఎం 5 గంటలు ఇస్తమంటున్నడు..గతంలో పవర్ హాలిడేలు ఉండేవి. పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేసేవారు. ఇప్పుడు 24 గంటల కరెంటు వస్తుంది..తెలంగాణ ఏర్పడంగనే బీజేపీ ఏడు మండలాలను ఆంధ్రలో కలిపేసింది.
దాంతో సీలేరు విద్యుత్ ప్రాజెక్టు మనకు దక్కకుండా పోయింది..తెలంగాణకు బీజేపీ ఇంత అన్యాయం చేసినా కాంగ్రెస్ నాయకులు ఒక్క మాట మాట్లాడలేదు..కేసీఆర్‌ని తట్టుకోలేక కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటవుతున్నయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం..రెండు దిల్లీ పార్టీలు దేశమంతా కొట్టుకొని తెలంగాణలో కలిసి పని చేస్తున్నాయి..బీజేపీ పార్లమెంటులో బిల్లు పెడితే కాంగ్రెస్ మద్ధతిస్తుంది..మొన్నటివరకు కాంగ్రెస్‌లో ఉన్నోళ్లు బీజేపీలో, బీజేపీలో ఉన్నోళ్లు కాంగ్రెస్‌లో చేరుతుండ్రు..కరువు, కర్ఫ్యూ రెండూ కాంగ్రెస్‌కి పుట్టిన కవలలు..అని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోని కాపీ కొట్టిందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారంటీలతో కొన్ని నెలల్లోనే ఆ రాష్ట్రం దివాలా తీసింది..కర్ణాటక గబ్బు పట్టిపోయింది. అక్కడి రైతులు లబోదిబోమంటున్నరు..మాట తప్పే కాంగ్రెస్ కావాల్నా, మాట మీద నిలబడే కేసీఆర్ కావాల్నా..తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ఏకైక ఇంటి పార్టీ బీఆర్ఎస్, కేసీఆర్ మాత్రమే..ఈమధ్య కాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి డిపాజిట్ లు పోయి బీజేపీ గెలిచింది,.మునుగోడు లో కాంగ్రెస్ డిపాజిట్లు పోయి, బీజేపీ కి ఎక్కువ వోట్లు పడ్డాయి..ఈ రెండు పార్టీలు ఒక్కటే..నిన్న మొన్నటి దాకా బీజేపీ లో.ఉన్న వివేక్, రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ లో చేరాడు..మనల్ని ఓడించేందుకు ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ గట్టిగ ఉన్న చోట బీజేపీ సపోర్ట్ చేస్తుంది..బిజెపి గట్టిగ ఉన్న చోట కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది..దిల్లీ లో కొట్టుకుంటారు, తెలంగాణ లో ఎన్నికలు అయితే కలుస్తారు..ఏడు మండలాలు ఏపి లో కలిపింది బీజేపీ సపోర్ట్ చేసింది కాంగ్రెస్..కాంగ్రెస్ హయాంలో కార్మికులను ఏనాడూ పట్టించుకోలేదు..గుర్రాలతో తొక్కించి, లాఠీలతో కొట్టించింది కాంగ్రెస్ ..ఆడవాళ్ళు అని చూడకుండా అర్దరాత్రి వరకు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ ది..కానీ కేసిఆర్ మహిళలను పిలిచి వారి సమస్యలు తీర్చి అన్నం పెట్టిన ఘనత కేసిఆర్ ది అన్నారు.
వచ్చే ప్రభుత్వంలో ఆటో కార్మికులు రవాణ కార్మికుల కోసం ట్రాన్స్పోర్ట్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ వీ ఒ ఏ లకు, ఆర్పీ లకు మీ వేతనాలు పెంచే బాధ్యత మాది..మీ వేతనాలు రెండింతలు పెంచుతాం..మహిళల కోసం మంచి నీటి బాధ తీర్చింది కేసిఆర్..ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వకపోతే వోట్లు అడగను అని చెప్పారు కేసిఆర్..ప్రతి పక్ష నాయకులు ఒక్కడు కూడా మంచి నీళ్ళ కోసం ఇప్పుడు అడగటం లేదు,మాట్లాడటం లేదు..మహిళా రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశారు కేసిఆర్ సంగారెడ్డి ఆర్డినెన్సు ఫ్యాక్టరీ అమ్ముకోవడానికి బీజేపీ కేంద్రం ప్రయత్నం చేస్తోంది..బిజెపి కి అమ్ముడు తప్ప వేరే తెలియదు..బిజెపి అంటే పెట్టుబడి దారులకు కొమ్ము కాసే పార్టీ..బిజెపి అంటే కార్మికుల వ్యతిరేక పార్టీ..కనీస వేతన సవరణ కచ్చితంగా చేస్తాం..అంగన్ వాడిలా సమస్యలు తీర్చుతాం..కోటి కుటుంబాలకు కేసిఆర్ బీమా సౌకర్యం చేపడుతున్నాం..ఏ కారణం చేతైన ఇంటి పెద్ద చనిపోతే ఆ ఇంటి మహిళకు వారం రోజుల్లో 5లక్షల భీమా డబ్బులు జమ చేస్తాం..ఇవన్నీ చేసుకుంటు పోతాం..ఎవడు ఎన్ని ట్రిక్కులు పన్నిన కేసిఆర్ హ్యాట్రిక్ కొట్టుడు పక్కా అని ధీమా వ్యక్తం చేసారు.జనవరి నుంచి సన్నబియ్యం ఇచ్చుడు ఖాయం..కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లన్ని తుస్సే..అవి అమలయ్యేది లేదు సచ్చేది లేదు..కేసిఆర్ వచ్చాక కార్మికులు రెండు షిఫ్టుల్లో పని చేసుకుంటున్నారు..కాంగ్రెస్ మేనిఫెస్టో కంటే మన మేనిఫెస్టో నయం..ఎగబెట్టిన చరిత్ర కాంగ్రెస్ ది, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర కేసిఆర్ ది అని మంత్రి హరీష్ రావు అన్నారు.




