Take a fresh look at your lifestyle.

ఈ ‌మహిళా దినోత్సవం మరింత ప్రత్యేకం..

“ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పంజా విసురుతున్న సమయంలో భారతదేశంలో కూడా ఆర్థిక పరిస్థితులు ఏ మాత్రం బాగా లేవు. ఈ సమయంలో ఆర్థిక అంశాలను పక్కన పడేసి హిందూ పరిరక్షణ పేరుతో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు అత్యధికంగా మహిళలనే బాధిస్తున్నాయి. దేశంలో గత నలభై ఐదు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం ప్రబలి ఉంది. ఈ నిరుద్యోగ సమస్య వలన పని చేయాలనుకుంటున్న మహిళలకు ఉద్యోగాలు దొరికే అవకాశం మృగ్యం అయిపోయాయి. భారతీయ మహిళ ఎదురుగా చాలా సవాళ్ళు ఉన్నాయి. అయితే ఈ సవాళ్ళును ఎదుర్కోవటానికి భారతీయ మహిళ అంతే సిద్ధ పడుతున్న చందం మనకు కనిపిస్తున్నది. ఈ తరుణంలో వచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు.”

aruna articles
అరుణ, న్యూఢిల్లీ
గెస్ట్ ఎడిటర్‌

స్త్రీలను దేవతగా పూజించే మన దేశంలో ఈరోజు మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. గతంలో ఎప్పుడూ లేనంతగా వేడుకగా ఈసారి భారతదేశంలో ఖచ్చితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిందే. భారతదేశంలో పౌరులకు దేశం నీకు ఏమి ఇచ్చింది అన్నది ఆలోచించకు.. దేశానికి నువ్వేమి ఇచ్చావు అన్న త్యాగనిరతితోనే ఆలోచించాలి అని నేర్పించారు. భారత దేశ పౌరుల నుంచి ఈ త్యాగాన్ని ఎల్లవేళలా ఆశించడం జరిగింది. పౌరులు ఈ విధంగా త్యాగనిరతితో ఆలోచిస్తూ ఉంటే.. రాజకీయ పార్టీలు తమకు ఇష్టం వచ్చినట్లుగా పాలించి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని రెండు ముక్కలు చేశారు. భారతదేశం చిత్రపటంగా ఒకటిగానే కనిపిస్తుంది. అయితే వాస్తవంగా చూస్తే ధనిక భారతదేశం.. పేద భారతదేశం.. అని రెండుగా భారతదేశం నేడు చీలి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి తారకమంత్రంగా జపించిన మోదీకి ప్రజలు రెండవసారి కూడా అధికారాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ అభివృద్ధి మంత్రాన్ని పక్కనపడేసి, కేవలం హిందూ పరిరక్షకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో ఆజన్మాంతం త్యాగం తప్ప మరొకటి తెలియని జాతిగా ప్రసిద్ధికెక్కిన భారతీయ మహిళ రోడ్డుపైకి వచ్చి రాజ్యాంగ పరిరక్షణ చేస్తున్నది. భారతదేశంలో చదువుకోవడమే అతి కష్టమైన విషయం ఇక రాజ్యాంగానికి సంబంధించిన అవగాహన ఉండటం దాదాపు అసంభవం. ఇటువంటి దేశంలో వంటింటి కుందేలు అని ముద్ర వేయించుకున్న బురఖా మహిళ, ఓ చేతిలో జాతీయ, జెండా మరో చేతిలో అంబేద్కర్‌ ‌ఫోటో పట్టి.. జనగణమన పాడుతూ పౌర సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నది. ఈ సంఘటనలు సంభవిస్తున్న సమయంలో ఓ హిందు మహిళ జర్నలిస్ట్ ‌దీనికి సంబంధించిన కథనాలు మీ ముందుకు తీసుకు వస్తున్న తరుణంలో మీరు కచ్చితంగా ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గతంలో కంటే అధిక ఆనంద ఉత్సాహాలతో సెలబ్రేట్‌ ‌చేసుకోవాలి అందులో అనుమానమే లేదు.

అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆనందోత్సాహాలతో సెలబ్రేట్‌ ‌చేసుకుంటున్న సమయంలోనే భారతదేశంలో మహిళ ఎదుర్కొంటున్న సవాళ్లు గురించి కూడా అవగాహన కలిగి ఉండాలి. సుప్రీం కోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌రంజన్‌ ‌గోగాయి జడ్జిగా ఉన్నప్పుడు తనను లైంగికంగా వేధించాడని కంప్లైంట్‌ ‌చేసిన మహిళ తన ఉద్యోగాన్ని కోల్పోవలసి వచ్చింది. ఈ వ్యవహారంపై దుమారం రేగితే ఓ కమిటీ వేసి ఆ కమిటీ తన పర్యవేక్షణలో పని చేసే లాగా సుప్రీం కోర్ట్ ‌చీఫ్‌ ‌జస్టిస్‌ ‌గా పనిచేసిన రంజన్‌ ‌గొగోయ్‌ ‌జాగ్రత్తలు తీసుకున్నారు. తత్ఫలితంగా చీఫ్‌ ‌జస్టిస్‌ ‌గా రంజన్‌ ‌గొగోయ్‌ ‌రిటైర్‌ అయిన తర్వాత మాత్రమే ఆరోపణలు చేసిన మహిళ తిరిగి తన ఉద్యోగాన్ని పొందగలిగారు. హిందూ పరిరక్షకుల ప్రభుత్వంలో హిందూ మహిళలు పడుతున్న కష్టాలు ఇలా ఉండగా.. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలు ప్రధానంగా నెత్తికెత్తుకున్న ముస్లిం మహిళలు పడుతున్న బాధలు మరో విధంగా ఉన్నాయి. వీరు పడుతున్న బాధలు ఏ తీరుగా ఉన్నాయో చూడాలి అంటే ఈశాన్యం ఢిల్లీలో ఉన్న ముస్తాబాద్‌ ఈద్గాలో ఏర్పాటు చేసి ఉన్నా సహాయ కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది. రుక్సానా అనే మహిళను కదిలించినప్పుడు ఈశాన్య ఢిల్లీలో జరిగిన మత ఘర్షణలను ఆమె తనదైన మాటలతో ఇలా వివరించారు.

ప్రభుత్వం పౌర సవరణ చట్టాన్ని తీసుకు వచ్చి పౌరుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించింది. దాని పర్యవసానమే ఢిల్లీలో జరిగిన మత ఘర్షణలు. ఈ చట్టం మంచిది కాదు అని రోడ్డుపైకి వచ్చి పోరాటం చేస్తున్న వారితో ప్రభుత్వం మాట్లాడలేక పోయింది. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజలలో మరో వర్గాన్ని మతం ఆధారంగా పౌర సవరణ చట్టానికి మద్దతుదారులుగా మలచింది. అటుపై పౌర సవరణ చట్టం అనుకూలురు, వ్యతిరేకుల మధ్య ఘర్షణ ఘట్టం అనే హింసాత్మక సినిమాని కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్ ‌చేసింది. ఈ క్రూరమైన పని చేయటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం నెలకొన్న రోజులలో భారతీయ ప్రజలు ఆర్థికంగా నష్టపోయే లాగా ఢిల్లీలో మతఘర్షణలు కేంద్రమే జరిపించింది. ఈ చర్యద్వారా మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు తీవ్ర నష్టం చేశారు. అని తేల్చి చెప్పారు రుక్సానా.

రుక్సానాకు నలుగురు పిల్లలు స్కూలు చదువు కూడా పూర్తి చేయలేక పోయింది. భర్త స్టీల్‌ ‌సామాన్లు మీద డిజైన్లు చెక్కుతారు. ఢిల్లీలో జరిగిన మత ఘర్షణల వలన భర్త ఫ్యాక్టరీ మొత్తం తగలబడిపోయింది. ఉంటున్న ఇల్లు అగ్నికి ఆహుతయ్యింది ప్రస్తుతం ఈమె ఈద్గాలో నలుగురు పిల్లలు భర్తతో కలిసి శరణార్థిగా వుంటున్నారు. సర్వం కోల్పోయినప్పటికీ రుక్సానా తన ఇంటి పక్కన ఉన్న హిందువును గాని.. బయట నుంచి వచ్చి జై శ్రీరామ్‌ అం‌టూ విధ్వంసం సృష్టించిన హిందువును గాని తప్పు పట్టకుండా నేరుగా ప్రభుత్వాధినేత మెడను పట్టుకున్నది. సోకాల్డ్ ‌వంటింటి కుందేలు ఇమేజ్‌ ఉన్నటువంటి రుక్సానా ఈ తీరుగా మాట్లాడటం కచ్చితంగా సెలబ్రేట్‌ ‌చేసుకో వాల్సిన విషయం. అదే సమయంలో ఆమె పడుతున్న బాధకు బాసటగా నిలవాల్సిన సమయం కూడా ఇదే.ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పంజా విసురుతున్న సమయంలో భారతదేశంలో కూడా ఆర్థిక పరిస్థితులు ఏ మాత్రం బాగా లేవు. ఈ సమయంలో ఆర్థిక అంశాలను పక్కన పడేసి హిందూ పరిరక్షణ పేరుతో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు అత్యధికంగా మహిళలనే బాధిస్తున్నాయి. దేశంలో గత నలభై ఐదు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం ప్రబలి ఉంది. ఈ నిరుద్యోగ సమస్య వలన పని చేయాలనుకుంటున్న మహిళలకు ఉద్యోగాలు దొరికే అవకాశం మృగ్యం అయిపోయాయి.

ఇటువంటి సమయంలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన మత ఘర్షణలు చాలా ఆస్తి నష్టాన్ని కలిగించాయి. తద్వారా చాలామంది బ్రతుకులు రోడ్డున పడ్డాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో అసంఘటిత రంగం తీవ్రంగా నష్టపోయి చాలా మంది ప్రజలు రోడ్డున పడ్డారు. అదే తీరున ఢిల్లీ మతఘర్షణలు వలన చాలా రెడీమేడ్‌ ‌బట్టలు తయారు చేసే ఫ్యాక్టరీలు, చిన్నచిన్న బేకరీలు, స్పేర్‌ ‌పార్టస్ ‌టైర్లు తయారుచేసే మార్కెట్లు తగలబడి పోయాయి. దీనివలన చాలామంది ఉపాధి కోల్పోయారు. దీని పర్యావసనం కేవలం మగవారి పైనే కాక వారిపై ఆధారపడి ఉన్నా బ్రతుకులపై కూడా పడుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు భారతీయ మహిళ ఎదురుగా చాలా సవాళ్ళు ఉన్నాయి. అయితే ఈ సవాళ్ళును ఎదుర్కోవటానికి భారతీయ మహిళ అంతే సిద్ధ పడుతున్న చందం మనకు కనిపిస్తున్నది. ఈ తరుణంలో వచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు.

Leave a Reply