అమూల్ పాల ధరల పెంపు

– లీటర్‌కు రెండు రూపాయలు పెంచిన సంస్థ
– అదే బాటలో మదర్ డెయిరీ కూడా

హైదరాబాద్, మే 13 : అమూల్ బ్రాండ్‌పై పాల ఉత్పత్తులు విక్రయించే గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ పాల ధరలను పెంచింది. లీటరుకు రూ.2 చొప్ప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. అమÖల్ స్టాండర్డ్ మిల్క్, గేదె పాలు, ఆవు పాలు, గోల్డ్, స్లిమ్/ట్రిమ్, టీ`స్పెషల్ పాల ధరలు లీటరుకు రూ.2 చొప్ప్పున పెరగనున్నాయి. గతేడాది మే 1న చివరిసారిగా ధరలు సవరించింది. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అమూల్ తెలిపింది. పశవుల దాణా, ప్యాకేజింగ్ ఖర్చులు, చమురు ధరలు పెరుగుదల దీనికి కారణమని పేర్కొంది. పాల రకాన్ని బట్టి లీటరుకు 2.5 నుంచి 3.5 శాతం మేర ధరలు పెరుగుతున్నాయని, ఆహార పదార్థాల ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఈ పెంపు తక్కువేనని పేర్కొంది. మదర్ డెయిరీ కూడా పాల ధరలను పెంచింది. లీటరుకు రూ.2 చొప్ప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. 14 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయని తెలిపింది. ఇతర కంపెనీలూ ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *