దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి

– ‘నమో జెన్ జీ కాన్‌క్లేవ’లో వక్తల పిలుపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, అభివృద్ధి చెందిన áదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వక్తలు పిలుపునిచ్చారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే ఆధ్వర్యంలో ‘నమో జెన్ జీ కాన్‌క్లేవ’ హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు, శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు ఈfల రాజేందర్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశంలో చోటుచేసుకున్న అభివృద్ధి, యువత సాధికారత, స్టార్టప్‌ల ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల కల్పన, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతకు లభించిన అవకాశాల గురించి వివరించారు. అలాగే మోదీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు యువత జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులపై కాన్‌క్లేవ్‌లో విస్తృత చర్చ జరిగింది. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.హరీశ్వర్ రెడ్డి, మల్కా యశస్వి, ఉపాధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, సందీప్ గౌడ్, నితిన్ నందకర్, అనితారెడ్డి, శరత్ చంద్ర, సాయినాథ్, రాష్ట్ర కార్యదర్శులు శివచంద్రగిరి, వరప్రసాద్ రెడ్డి, అరవింద్ రెడ్డి, హరిప్రసాద్, ప్రదీప్‌రావు, ఝాన్సీ, కోశాధికారి నరేన్ దేశ్‌పాండేతోపాటు బీజేవైఎం రాష్ట్ర పదాధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *