హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10: విద్యార్థుల సమస్యలు పరిష్క రించాలని ఎస్ఎఫ్ఎ నాయకులు ప్రజాభవన న్ను ముట్టడించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ లో భాగంగా ప్రజాభవన్ వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థుల సమస్య లను సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవటం లేదని, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆయన ఆడుకుంటున్నారని ధర్నాకు దిగారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల సహా ప్రైవేటు పాఠ శాలల్లో ఫీజుల కట్టడికి చట్టం తేవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




