“2026 వ సంవత్సరం థీమ్* ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే థీమ్ తో ఈసారి దేశంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహిస్తున్నారు. వృద్ధాప్యం
లో కీళ్లు నొప్పులు తగ్గించి శరీర సమతుల్యత ఫ్లెక్సీ బిలిటీ మేరుగుపరచడం వయసుతోపాటు వచ్చే ఒత్తిడి ఆందోళన దూరం చేసి మానసిక ఉల్లాసాన్ని పెంచడం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల తీవ్రత తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచడం .వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఏజింగ్ (2021_ 2030)లక్ష్యాలకు మద్దతుగా నిలవడం..”

అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం
హైదరాబాద్
హైటెక్ యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో నిరంతరం కాలంతో పోటీ పడుతున్న మానవుని జీవితంలో శరీరము మనసు తీవ్ర ఒత్తిడికి గురౌతుంది . ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే దివ్యౌషధం యోగ . యోగాను ప్రపంచ దేశాలకు భారతదేశం పరిచయం చేసింది .క్రీస్తు పూర్వం పతంజలి మహర్షి యోగ ను అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించాడు. భారతదేశం నుంచి ఉద్భవించిన జైన‘ బౌద్ధ ‘ హిందూ మతంలో యోగాకు ఒక ప్రత్యేక స్థానం కల్పించారు.20వ శతాబ్దం అనంతరం ఆరోగ్యపరిరక్షణలో యోగ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.యోగ అభ్యసించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతాలలో యోగా ఒకటి. మనిషి శారీరక ‘మానసిక ప్రశాంతతకు ఆరోగ్యానికి యోగ ఎంతగానో దోహదపడుతుంది.నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్నిదేశాలు యోగాను పాటిస్తున్నాయి.
యోగ మన ప్రాచీన సంస్కృతి వారసత్వం: యోగ అన్న పదం సంస్కృతంలోని యజ అనే పదము నుండి పుట్టింది. యజ అనగా దేనినైనా ఏకం చేయగలమని అర్థం. ఆసనం అంటే భంగిమ ఈ రెంటిని యోగాసనాలు అంటారు. మనసు శరీరాన్ని ఏకం చేసి ఆద్యాత్మిక తాదాత్మ్యం అందించేది.శరీరం మనసు ఆత్మలో చేయడం మరియు జ్ఞానోదయమైన అవగాహన సాధించడం.
యోగ చరిత్ర: యోగ వేదకాలం నుండే యోగ ఉందని పురాణాలు చెబుతున్నాయి. యోగకు 2000యేళ్ల చరిత్ర ఉంది . మన దేశ సాంస్కృతిక ప్రాచీన వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది.కానీ ఆనాటి రోజుల్లో యోగ కొన్ని వర్గాలకే పరిమితమైంది .ఋషులు ఆశ్రమాలలో ఉన్న శిష్యులకు మాత్రమే యోగ అభ్యసన అధ్యయన ప్రక్రియను పరిమితం చేశారు.
నరేంద్ర మోదీ యోగ ప్రాధాన్యత : నరేంద్రమోదీ భారత ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగాకు పెద్దపీట వేశారు.ప్రపంచ మానవాళి “అనారోగ్యం నుండి ఆరోగ్యం వైపు వెళ్లేందుకు యోగాయే ఉత్తమ మార్గమని” పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014 సెప్టెంబర్ 27 న ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో యోగ ప్రాధాన్యం గురించి ప్రసంగించి ప్రపంచ దేశాలను యోగ ప్రాధాన్యతను గుర్తించే విధంగా చేసిన ప్రతిపాదనను డిసెంబర్ 11 2014 న ఐక్యరాజ్యసమితి ఆమోదించింది.ప్రధాన మంత్రి చొరవతో ప్రతి యేటా జూన్ 21 న అంతర్జాతీయయోగదినోత్సవం నిర్వహించాలని యు‘ఎన్ ‘ఓ(UNO) నిర్ణయించింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవ తీర్మానాన్ని 193 దేశాలు సమర్థించాయి .నాటి నుండి ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయయోగాదినోత్సవం జరుపుకుంటారు.
2026 వ సంవత్సరం థీమ్: ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే థీమ్ తో ఈసారి దేశంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహిస్తున్నారు.
వృద్ధాప్యంలో కీళ్లు నొప్పులు తగ్గించి శరీర సమతుల్యత ఫ్లెక్సీ బిలిటీ మేరుగుపరచడం వయసుతోపాటు వచ్చే ఒత్తిడి ఆందోళన దూరం చేసి మానసిక ఉల్లాసాన్ని పెంచడం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల తీవ్రత తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచడం .వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఏజింగ్ (2021_ 2030)లక్ష్యాలకు మద్దతుగా నిలవడం. ఈ ఏడాది యోగ జాతీయ వేడుకలు పశ్చిమ బెంగాల్ లోని కలకత్తా రెడ్ రోడ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐక్య రాజ్య సమితి ఆధ్వర్యంలో సుమారు 200 కంటే ఎక్కువ దేశాల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ప్రాణాయామం మానసిక దృఢత్వం: ప్రాణాయామం ద్వారా మానసిక దృఢత్వాన్ని సాధించ వచ్చును.భారతీయ మూలాల్లో ప్రాణాయామ వ్యవస్థ వుంది దశాబ్దాల కిందటే ప్రాణాయామాన్ని ఆచరించిన చారిత్రిక ఆధారాలు ఉన్నాయి.
మనో బలానికి యోగ: మానవునికి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సడలని మానసిక దృఢత్వాన్నియోగ అందిస్తుంది .స్వామి వివేకానంద సైతం ఈ విషయాన్ని వెల్లడించారు. కొరోనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభ సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్ దైర్యంగ నిలబడటం గమనార్హం.
యోగ ను పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలి: ప్రభుత్వం నూతన విద్య విధానంలో కేంద్ర ‘రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల‘ కళాశాల స్థాయిలో యోగ ప్రాణాయామం పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి .యోగ పోటీలను నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు రివార్డులు ఇచ్చి సత్కరించాలి. స్వీయ పరిశీలన సరళ జీవనం వనరుల పరిమితమై వినియోగం ప్రకృతితో మమేకమై జీవించడం ఇవే యోగ మూల స్తంభాల అన్న ఆలోచనలు సమాజంలో కలిగించాలి.
యోగ సమగ్రవ్యక్తిత్వ వికాసం: యోగా కేవలం శారీరక వ్యాయామం కాదని అది సమగ్ర వ్యక్తిత్వ పరివర్తనకు మార్గం అనే ప్రచారం జరగాలి. ఆటపాటలు సృజనాత్మకత అలవాట్లు పిల్లలు యౌగలో పాల్గొనే అవకాశం కల్పించాలి . బాల్యంలో యోగాను ప్రోత్సహించడం అంటే తదుపరి జీవితంలో జ్ఞానానికి కావలసిన పునాదులు వేయడమే అన్న అవగాహన పెరగాలి. ప్రస్తుత వినిమయ ప్రపంచంలో అనవసర వస్తువు వినియోగం పెద్ద సమస్యగా మారింది .యోగ సూత్రాలను పాఠ్యాంశంలో చేర్చి పిల్లలకు వివరించాలి ఎలా ఆచరించాలో ఉదాహరణలతో చర్చించాలి. పర్యావరణహితంగా వ్యవహరించడం ప్రజాజీవనంలో ఆడంబరాలు తగ్గించడం ఉత్తమమనే అభిప్రాయం కలగాలి మానవీయ విలువలను పెంపొందించడంలో యువత ముందుకు రావాలి.రేపుటి పౌరుల ఆనందమయ జీవితానికి యోగను ఒక ఆచరణ మార్గంగా చూపించాల్సిన బాధ్యత అందరిది.
యోగ యువత
యోగ సాధన లో యువత సంపూర్ణ భాగస్వాములైతె ఆత్మహత్యలు డ్రగ్స్ మాదక ద్రవ్యాల బారిన పడకుండా మనోనిబ్బర వైఖరి పెరుగుతుంది.యోగలో ప్రజలు భాగస్వాములు అవుతే రాజ్యాంగంలో పేరుకొన్న అందరికీ ఆరోగ్యంఅన్న లక్ష్యం నెరవేరుతుంది.
కార్పొరేట్ వైద్య దోపిడి అడ్డుకోవచ్చు: వైద్య‘ ఆరోగ్య రంగములో రాజ్యమేలుతున్న కార్పోరేట్ వైద్య ఆరోగ్య ఆర్థిక దోపిడీని అడ్డుకోవచ్చు. పిల్లలు పెద్దలు యువకులు మహిళలు అన్ని వయసుల వారు యోగాసనాలు నిత్య జీవితములో ఒక భాగం చేసుకోవాలి.పౌర సమాజం యోగ వల్ల కలిగే విస్తృత ఆరోగ్య మానసిక ఆరోగ్యం ప్రయోజనాల పట్ల అవగాహన చైతన్య సదస్సులు సమావేశాలు నిర్వహించాలి . రోగ రహిత సమాజ స్థాపన లోయోగ క్రియాశీల పాత్ర పోషించాలి . యోగ ప్రతి వ్యక్తి జీవన శైలి కావాలి. యోగ చేద్దాం ఆరోగ్య భారత్ నిర్మాణానికి పాటుపడుదాం అని ప్రతి పౌరుడు ప్రతిజ్ఞ చెయ్యాలి.
(జూన్21న 12వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా).





