~ రక్తనాళాల సమస్య నుంచి కోలుకున్న యువకుడు
– అద్భుత నైపుణ్యం ప్రదర్శించిన వైద్య బృందం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, అరుదైన బ్రాకియల్ ఆర్టరీ వేరియేషన్ (బ్రాకియల్ ఆర్టరీ హై బైఫురకేషన్) కారణంగా అత్యంత ప్రమాదకరమైన అక్యూట్ అప్పర్ లింబ్ ఇస్కీమియాతో బాధపడుతున్న 16 ఏళ్ల యువకుడికి మలక్‌పేట్ యశోదా ఆసుపత్రి వైద్య బృందం అరుదైన శస్త్రచికిత్స చేసి అతని చేతినీ, ప్రాణాలనూ కాపాడిరది.నల్గొండ జిల్లాకు చెందిన రమావత్ రమేశ్ అనే యువకుడిని ప్రమాదం జరిగిన కీలకమైన ‘గోల్డెన్ పీరియెడ్’ (6 గంటలు) దాటిన తర్వాత ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతని ఎడమ చేతికి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోయింది. అంతేకాక, మొత్తం జనాభాలో కేవలం 8% మందిలో కనిపించే ‘బ్రాకియల్ ఆర్టరీ హై బైఫర్కేషన్’ అనే అరుదైన రక్తనాళాల వైవిధ్యం అతనిలో ఉండటం చికిత్సను మరింత క్లిష్టం చేసింది. అతని ప్రధాన రక్తనాళంతోపాటు మరో రెండు ముఖ్యమైన నాళాలు తెగిపోయాయని సి.టి. యాంజియోగ్రామ్ ద్వారా డాక్టర్లు గుర్తించారు. వాస్క్యులర్, ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ నిపుణులతో కూడిన బృందం అత్యవసరంగా రంగంలోకి దిగింది.డా. రంజిత్ కుమార్ ఆనందసు (వాస్క్యులర్ సర్జన్) ఆధ్వర్యంలో జీఎస్‌వీ బైపాస్, ఎంబొలెక్టమీ నిర్వహించి తెగిపోయిన రక్తనాళాలను తిరిగి కలిపారు.ఆర్థోపెడిక్ టీమ్ ఎముక స్థిరీకరణకు ఎక్స్‌టర్నల్ ఫిక్సేషన్ అందించింది.డా. ఎం.వి. చంద్రమౌలి (ప్లాస్టిక్ సర్జన్) నేతృత్వంలో గాయాన్ని మాన్పడానికి ఫ్లాప్ కవర్, స్కిన్ గ్రాఫ్ట్ విజయవంతంగా పూర్తి చేశారు.వాస్క్యులర్ సర్జన్ డా. రంజిత్ కుమార్ ఆనందసు మాట్లాడుతూ, ‘‘రోగి ఆలస్యంగా రావడం, అరుదైన రక్తనాళాల సమస్య, రెండు మెయిన్ ఆర్టరీలు తెగిపోవడం అత్యంత సంక్లిష్ట స్థితి. సకాలంలో బైపాస్ చేయబట్టే రక్తం తిరిగి ప్రవహించింది,’’ అని తెలిపారు. ప్రస్తుతం యువకుడు రమేశ్ పూర్తిగా కోలుకున్నాడు. ఆపరేషన్ చేసిన చేయికి రక్తప్రసరణ చక్కగా జరిగి, గాయం పూర్తిగా మానిపోయింది.ఈ కేసు, మలక్‌పేట్ యశోదా ఆసుపత్రిలో మల్టీడిసిప్లినరీ ట్రామా కేర్ అందుబాటులో ఉండటానికి, వైద్య బృందం యొక్క అద్భుతమైన నైపుణ్యానికి, సమన్వయానికి నిదర్శనం. యశోదా హాస్పిటల్స్ అన్ని శాఖల్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సేవలు అందుబాటులో ఉన్నాయని హాస్పిటల్స్ డైరెక్టర్ గోరుకంటి పవన్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిన నెంబర్లు: ఎ. వాసుకిరణ్ రెడ్డి – 97057 71230 / 99499 98378.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





