ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– ప్రైవేట్ పరం చేసే యత్నాలను అడ్డుకుంటాం-
– ప్రజలు సమస్యల్లో ఉంటే సభలతో కాలయాపనా
– 25న రాజకీయ శక్తిగా ముందుకు రాబోతున్నాం
– జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులంటే ప్రభుత్వం లెక్కలేనితనంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆర్టీసీలో కార్మికులు లేకుండా చేసి సంస్థను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ ఈ కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరించారు. సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సమ్మెకు దిగిన ఆర్టిజన్లను బెదిరించి విధుల్లో చేరేలా ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలని కవిత డిమాండ్ చేశారు. ప్రజలందరూ సమస్యల్లో ఉంటే అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయని మండిపడ్డారు. ప్రతిపక్షం ఉట్టి కథలు చెబితే ప్రభుత్వం పిట్ట కథలు చెప్పిందంటూ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ సభలో బీజేపీపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడలేదని జాగృతి అధ్యక్షురాలు నిలదీశారు. వెయ్యి ఏళ్లయినా బీఆర్‌ఎస్ మారదని కవిత వ్యాఖ్యానించారు. గుంటనక్క నిన్న దిల్లీ వెళ్లి ఆరఎసఎస్ పెద్దలను కలిసిందన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతి నుంచి బయటపడేందుకు ఆరఎసఎస్‌తో చర్చలు జరిపారంటూ కవిత ఆరోపించారు. ఈనెల 25న తెలంగాణ రాజకీయాల్లోకి నూతన రాజకీయ శక్తిగా వస్తున్నామని, ప్రజలందరికీ ఈ వేదిక నుంచి ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. పార్టీ ఆవిర్భావ సభకు సిరిసిల్ల నుంచి పార్టీ కార్యకర్తలు మంగళవారం పాదయాత్రగా బయలుదేరారని తెలిపారు. తమ పార్టీ ఆవిర్భావ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే కేడర్ వాహనాలకు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని పోలీసులు, అధికార యంత్రాంగాన్ని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *