న్యూదిల్లీ, అక్టోబర్ 7: ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ వరించింది. ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో మాక్రోస్కోపిక్ క్వాంటం మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్ ఆవిష్కరణకు శాస్త్రవేత్తలు జాన్ క్లార్క్, మైఖేల్ డెవోరెట్, జాన్ మార్టినిస్‌లకు 2025 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చినట్లు మంగళవారం నోబెల్ కమిటి తెలిపింది. జాన్‌క్లార్క్, మిచెల్‌హెచ్.డివోరెట్, జాన్.ఎం మార్టిన్స్‌లు ముగ్గురు ఈ అవార్డను సంయుక్తంగా గెలుచుకున్నారు. నోబెల్ భౌతిక శాస్త్ర బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడ ఆఫ్ సైన్సెస్ ప్రదానం చేస్తుంది. బహుమతి గెలుచుకున్న ముగ్గురికి మొత్తం 11 మిలియన్ స్వీడిష్ కిరీటాల(1.2 మిలియన్ డాలర్లు) బహుమతి రానుంది. ఈ మొత్తాన్ని వాళ్లు ముగ్గురు పంచుకో నున్నారు. ఇప్పటికే తొలి నోబెల్ బహుమతి వైద్య రంగంలో ముగ్గురు వైద్యులకు సంయుక్తంగా లభించింది. మిగిలిన విభాగాల్లో నోబెల్ బహుమతుల విజేతల పేర్లను ఈనెల 13వ తేదీ వరకు ప్రకటించనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, శాస్త్రవేత్త ఆల్ఫ్రె నోబెల్ మరణం తరువాత ఈ నోబెల్ బహుమతులు అందజేస్తున్నారు. ఆల్ఫ్రె నోబెల్ తన సంపదలో ఎక్కువ భాగాన్ని వివిధ రంగాలలో బహుమతులను అందజేయడానికి వీలునామా రాశారు. 1895 నాటి ఆయన వీలునామా ప్రకారం గత ఏడాదిలో, మానవాళికి గొప్ప ప్రయోజనం చేకూర్చిన వారికి బహుమతులు ప్రదానం చేయాలని నిర్దేశిరచారు. ప్రతి ఏడాది డిసెంబర్ 10న నోబెల్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ రోజు ఆల్ఫ్రె నోబెల్ వర్ధంతి. ఈ రోజున నోబెల్ బహుమతులు గ్రహీతలకు ప్రదానం చేస్తారు. మొదటి నోబెల్ బహుమతులు 1901లో ప్రదానం చేశారు. నాటి నుంచి ఏటా అందజేస్తున్నారు. అప్పటి నుంచి కొన్ని సార్లు నోబెల్ బహుమతులు ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 వరకు కొనసాగింది. రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు కొనసాగిన సమయంలో నోబెల్ బహుమతులు ఇవ్వలేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





