మోదీకి మద్దతుగా నారీ ర్యాలీ

– ‘నారీ శక్తి వందన్’పై చర్చ జరగనున్న సందర్భంగా..

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : బీజేవైఎం ఆధ్వర్యంలో మహిళల సాధికారతకు మద్దతుగా, అలాగే మహిళలకు 33% రిజర్వేషన్ల బిల్లుకు అనుకూలంగా బీజేపీ¾ రాష్ట్ర మహిళా మోర్చా, యువమోర్చా ఆధ్వర్యంలో బుధవారం స్కూటీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు హాజరయ్యారు. వందలాదిమంది మహిళలు, యువతులు ర్యాలీలో పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ బిల్లుపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ 2029 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నాటికి మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న క్రమంలో ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ‘నారీ శక్తి వందన్ అధినియమ’పై చర్చ జరగబోతోందన్నారు. ఈ శుభ సందర్భంగా దేశవ్యాప్తంగా మహిళలు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నారని, ఆ క్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా, యువమోర్చా ఆధ్వర్యంలో స్కూటీ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల అంశం ముప్పయ్యేళ్లుగా పెండింగ్‌లో ఉందని, యూపీఏ ప్రభుత్వ కాలంలో కాంగ్రెస్.. మిత్రపక్షాల ఒత్తిడితో ఈ బిల్లును ముందుకు తీసుకురాలేదని తెలిపారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ బిల్లును తిరిగి పార్లమెంటులో ప్రవేశపెడుతున్నాsంటూ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లు అమలుకు అడ్డంకులు సృష్టించేలా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈ బిల్లు అమలవకుండా చేయాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇండీ అలయెన్స్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని, ఆయన చేస్తున్నది పూర్తిగా తప్పుడు ప్రచారమని అన్నారు. ఇది దేశాన్ని విభజించే రాజకీయాలకు దారి తీసే చర్య అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మతం, కులం, ప్రాంతాల పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఆయన రాసిన లేU కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉందని స్పష్టం చేస్తోందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టంగా చెప్పినందున కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, దక్షిణాది ప్రజలు ఈ అబద్ధాల ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లపై పార్లమెంటులో చర్చించనున్న ఈ చరిత్రాత్మక సందర్భంలో తెలంగాణలోని మహిళలందరికీ రామచందర్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *