హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 104వ జయంతి సందర్భంగా సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా, అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పీవీ నరసింహారావు సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
పీవీకి మంత్రి దామోదర ఘన నివాళి
