– కోతుల కొట్లాటలో రాయి పడి మహిళ మృతి
జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్ 18: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కోతుల కొట్లాట ఓ మహిళ ప్రాణాన్ని బలి తీసుకుంది. మిద్దెపై కోతులు కొట్లాటలో కింద ఉన్న మహిళ తలపై సిమెంట్ ఇటుక పడింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ధర్మపురిలోని కమలాపూర్ రోడ్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన కొనపర్తి సత్యనారాయణ, పద్మ భార్యాభర్తలు. బుధవారం సాయంత్రం పద్మ ఇంటి ముందు కూర్చుని మరో మహిళతో మాట్లాడుతోంది. అదే సమయంలో ఇంటి రేకులపై కోతులు తీవ్రంగా గొడవపడ్డాయి. ఈ క్రమంలో రేకులు గాలికి ఎగిరిపోకుండా ఉండటానికి బరువు కోసం పెట్టిన సిమెంట్ ఇటుకను కిందకు పడేశాయి. ఆ ఇటుక నేరుగా పద్మ తలపై పడింది. తీవ్ర గాయం అవడంతో పద్మ అక్కడికక్కడే చనిపోయింది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




