గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోక తప్పదు

– మరోమారు ట్రంప్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌, జనవరి 10: ఎట్టిపరిస్థితుల్లో గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా వెనకడుగు వేసినా ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని ఆరోపించారు. ఆ దేశాలు అమెరికాకు పొరుగుదేశాల్లాగా ఉండటం తనకేమాత్రం ఇష్టం లేదని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా గ్రీన్‌లాండ్‌ను పొందాలని అనుకున్నాం కానీ అది సాధ్యం కాలేదు. కాబట్టే కఠిన మార్గాలను అనుసరించాల్సి వస్తోంది. గ్రీన్‌లాండ్‌ చుట్టూ ఉన్న జలాల్లో ఇప్పటికే చైనా, రష్యా తమ నౌకలను మోహరించి ఉన్నాయి. అమెరికా గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోకపోతే ఆ పనిని చైనా, రష్యాలు చేస్తాయి. అందువల్లే గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి కఠిన మార్గాలను ఎంచుకోవడానికైనా మేం సిద్ధంగా ఉన్నామన్నారు. అది అమెరికాకు వ్యూహాత్మకంగా, రక్షణపరంగా కీలకమైనది. ఆర్కిటిక్‌ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి దానిపై నియంత్రణ అవసరం. దీనిపై మరింత లోతుగా చర్చలు జరపడానికి గ్రీన్‌లాండ్‌, డెన్మార్క్‌ నేతలతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీి అవుతారు’ అని ట్రంప్‌ వైట్‌హాస్‌లో విూడియా ముందు వ్యాఖ్యానించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page