కరీంనగర్‌ అభివృద్ధ్దికి కృషి చేస్తా

-సిసి రోడ్డు పనులకు కేంద్ర మంత్రి బండి శంకుస్థాపన

కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,జూలై15: కరీంనగర్‌ అభివృద్దికి మరిన్ని నిధులు తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. కరీంనగర్‌ ‌ను మరింతగా అభివృద్ది చేయాల్సి ఉందన్నారు. నగరంలోని 47వ డివిజన్‌లో యూడీఎఫ్‌ ‌నిధులు రూ.50 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌శంకుస్థాపన చేశారు. అనంతరం 62వ డివిజన్‌ ‌మంకమ్మతోటలో రూ. 98లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు మేయర్‌ శ్రీ‌నివాస్‌తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధే లక్ష్యంగా భాజపా పని చేస్తోందన్నారు. కరీంనగర్‌ ‌నగరాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని.. మరిన్ని నిధులు తీసుకొచ్చి పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *