– మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
– మిషన్ ప్రకృతి అవార్డుల ప్రదానోత్సవం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15: భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, పచ్చటి పర్యావరణం అందించాలంటే చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన, బాధ్యత పెంపొందించాలి అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మాసాబ్‌ట్యాంక్‌లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాలయంలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా, టీజీఎస్ గురుకుల విద్యాలయాల సంఘం సంయుక్తంగా నిర్వహించిన మిషన్ ప్రకృతి అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ పాఠశాలలు, ఉపాధ్యాయులు, నేచర్ క్లబ్ విద్యార్థులకు అవార్డులు, ప్రశంసాపత్రాలు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని మంత్రి అన్నారు. మొక్కలు నాటడం, జీవవైవిధ్యాన్ని కాపాడడం, నీటి వనరులను సంరక్షించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలని సూచించారు. గురుకుల విద్యార్థులు విద్యలోనే కాకుండా పర్యావరణ పరిరక్షణలోనూ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారని మంత్రి అభినందించారు. మిషన్ ప్రకృతి వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమ, బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 238 గురుకుల సంస్థలు పాల్గొని 1,478 నేచర్ క్లబ్ సభ్యులు నాయకత్వం తీసుకున్నారు. 1.75 లక్షల పైగా విద్యార్థులకు పర్యావరణ అవగాహన ఏర్పడింది. కార్యక్రమంలో అనిల్ కుమార్, ఫరీదా టంపాల్, వనితా దాట్ల, పీఎస్ఎం. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



