గొప్ప న‌గ‌రంగా ఫ్యూచ‌ర్ సిటీని తీర్చిదిద్దుతాం

– 150 రోజుల్లోనే ఎఫ్‌సీడీఏ కార్యాలయం ప్రారంభం
– ప్ర‌సిద్ది గాంచిన‌ 500 పెద్ద కంపెనీల‌ను ఇక్క‌డికి ర‌ప్పిస్తాం
– రేప‌టి భ‌విష్య‌త్తుకు నేడే పునాది
– అడ్డుప‌డిన‌వారి సంగ‌తి ప్ర‌జ‌లే తేలుస్తారు
– ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 10:  ప్ర‌పంచానికి ఒక దిక్సూచి గా ఫ్యూచ‌ర్ సిటీని గొప్ప న‌గ‌రంగా తీర్చిద్దాల‌న్న సంకల్పంతో ప్ర‌భుత్వం ఉందని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధ‌వారం ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) భవనం ప్రారంభోత్సవం సంద‌ర్భంగా ప్ర‌సంగిస్తూ క‌ళ్ల‌లో నిప్పులు పోసుకుని, క‌డుపులో విషం నిప్పు కొని అమెరికాలో కూడా ఫ్యూచ‌ర్  సిటీ ని ర‌ద్దు చేస్తామంటున్నారు. వాళ్ల‌ని  తెలంగాణ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు..వాళ్లకు గ‌త‌మే త‌ప్ప‌ భ‌విష్య‌త్తు లేదన్నారు. ఫ్యూచ‌ర్ సిటీ ని ర‌ద్దు చేస్తామంటే వ‌చ్చే సారి ప్ర‌తి ప‌క్ష హోదా కూడా రాదన్నారు. ఈ ప్రాంత ప్ర‌జ‌లు బండ‌కేసి కొడ‌తారు. స‌రిగా 150 రోజుల్లో ప్యూచ‌ర్ సిటీ అథారిటీ డెవ‌ల‌ప్మెంట్ కార్యాల‌యాన్ని ప్రారంభించుకున్నాం. జూన్ 10, 2026 న తేదీన సువ‌ర్ణ అధ్యాయాన్ని సృష్టించాం. గ్రీన్ ఫార్మా, జీసీసీ, ఐటీ కంపెనీలు ల‌తో పాటు ప్ర‌పంచంలోని ప్ర‌సిద్ది గాంచిన‌ 500 పెద్ద కంపెనీల‌ను ఫ్యూచ‌ర్  సిటీకి ర‌ప్పించ‌బోతున్నాం. మ‌రో  గ్లోబ‌ల్ స‌మ్మిట్ పెట్టి  ప్ర‌పంచ దేశాల‌ను ఇక్క‌డికి రప్పించాం. ఫ్యూచ‌ర్ సిటీలో కొన్ని గ్రామాల‌ను ఈ రోజు క‌లిపాం. ఫ్యూచ‌ర్ సిటీ ని ప్ర‌పంచానికి గొప్ప న‌గ‌రంగా రాణిస్తుంద‌న‌డంలో అనుమానం లేదు. వీలైన‌ప్పుడ‌ల్లా ఫ్యూచ‌ర్ సిటీ అథారిటీ కార్యాల‌యానికి వ‌స్తాను. డీప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి శ్రీధ‌ర్ బాబు వారానికోసారి ఇక్క‌డికి వ‌స్తారన్నారు. రేప‌టి భ‌విష్య‌త్తుకు ఈనాడే పునాదులు వేసి ప్ర‌పంచానికి అద్భుత‌మైన న‌గ‌రాన్ని అందించ‌బోతున్నామ‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి గొప్ప చ‌రిత్ర ఉంది. 200 యేళ్ల క్రితం హైద‌రాబాద్ ను విస్తరించ‌డం వ‌ల్ల  సికింద్రాబాద్ తో క‌లిసి జంట న‌గ‌రాలుగా విల‌సిల్తుతున్నాయి. రాష్ట్రానికి 60 శాతం ఆదాయం ఇక్క‌డి నుంచి వ‌స్తోంది. బంగారానికి కంటే రంగారెడ్డి జిల్లా భూములకు విలువ ఎక్కువ. 1908 లో తుఫాన్ వ‌చ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆ నాటి నిజాం న‌వాబు మూసీ న‌ది పైన నిర్మాణాలు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో యుద్ధ సామాగ్రిని ఉంచ‌డం వ‌ల్ల శత్రు దుర్భేద్యంగా  మారింది. ఆ నాటి పాల‌కులు సైబ‌రాబాద్ ను నిర్మించి గొప్ప న‌గ‌రాన్ని ప్ర‌పంచానికి అందించారు. హైటెక్ సిటీ, అవుట‌ర్ రింగ్ రోడ్డు, అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ,జీనోమ్ వ్యాలీ లాంటివి వ‌ద్దే వ‌ద్దున్నారు. ఆ నాడు కూడా అనేక‌ కుట్ర‌లు , కుతంత్రాలు చేశారు. మూసీలో మురికి  కంటే ఎక్కువ విషాన్ని చిమ్మారు. ఆ నాటి పాల‌కులు హైటెక్ సీటీ, అవుట‌ర్ రింగ్, అంత‌ర్జాతీయ‌ ఎయిర్ పోర్టు , జీనోమ్ వ్యాలీ లాంటి తీసుకురాక‌పోతే ఈ నాడు 10 ల‌క్ష‌ల మంది కి ఉపాధి ల‌భించేదా.. ? రావ‌ణాసురుడు, శుక్రాచార్యుడు, మారీచుడు, సుభాహుడు లా ఆ నాడు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు.  ఇప్పుడు శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో ఉండి మారీచుడు, సుభాహుడిని పంపించాడు. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ ని ర‌ద్దు చేస్తామ‌ని పెద్ద రాక్ష‌సుడు, చిన్న రాక్ష‌సులు  అంటున్నారు. అడ్డుప‌డిన వాళ్లను అడ్డంగా తొక్కుకుంటు ఈ ప్రాంతం వాళ్లే వెళ్తారు. ఈ న‌గ‌రాన్ని ఇక్క‌డి వాళ్లే కాపాడుకుంటారు. ప్ర‌పంచానికి దిక్సూచి గా ఈ ప్రాంతం ఉంటుంది.కాలుష్య ర‌హిత గొప్ప‌న‌గ‌రంగా తీర్చిదిద్దుతామ‌న్నారు.2034 నాటికి వ‌న్ ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీకి భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ కీల‌కం కావాలి. తొల‌క‌రి వ‌ర్షం ప‌డితేనే హైద‌రాబాద్ లో  రోడ్డులు ఎక్క‌డిక్క‌డ స్తంభించిపోయాయి. కిలోమీట‌ర్  దూరానికి రెండు నుంచి నాలుగు గంట‌ల ప‌ట్టింది.  100 కోట్ల కు ఎక‌రం అమ్మిన‌మ‌ని జ‌బ్బ‌లు చ‌ర్చుకున్న వాళ్లు  నిన్న‌టి వ‌ర‌ద‌ల‌కు స‌మాధానం చెప్పాలి. ప్ర‌భుత్వ భూముల‌ను ఆక్ర‌మించుకుని, కుంట‌ల‌ను చెర‌పట్ట‌డం వ‌ల్ల‌నే చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు కాల‌నీలు, బ‌స్తీల‌కు వ‌చ్చాయి. ప్ర‌భుత్వ భూములు, చెరువుల‌ను , కుంటల‌ను ఆక్ర‌మించుకున్న వారి క‌ట్ట‌డాల‌ను నిర్ధాక్ష్య‌ణంగా కూలుస్తున్నాం. మేం ఎవ‌రైనా ఇంచు భూమైనా తీసుకున్నామా..? ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి చెరువుల‌ను పున‌రుద్ద‌రిస్తున్నాం. లేక్ ఎక‌నామీ ని త‌యారు చేస్తున్నాం.. మ‌హిళా సంఘాలు వ్యాపారం చేసుకునేలా చేస్తున్నాం. రాజేంద్ర‌న‌గ‌ర్ లో చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి పునరుద్ద‌రించాం. కూక‌ట్ ప‌ల్లి నల్ల చెరువు, అంబ‌ర్ పేట లో బ‌తుక‌మ్మ కుంట ను పున‌రుద్దించాం. బీఆర్ఎస్ నాయ‌కుడు ఎడ్ల సుధాక‌ర్ రెడ్డి బ‌తుక‌మ్మ కుంట‌ను ఆక్ర‌మించి హెలికాఫ్ట‌ర్ లో పూలు చ‌ల్లాడ‌ని గ‌త ప్ర‌భుత్వం ఆయ‌న‌కు రాసి ఇచ్చింది. బ‌తుక‌మ్మ కుంట‌ను దుర్మార్గులు చెర‌ప‌డితే వాళ్ల ప‌ని ప‌ట్టి పున‌రుద్దించాం. గండి పేట‌, హిమాయ‌త్ సాగ‌ర్ ను గొప్ప వ్య‌క్తులు ఆక్ర‌మిస్తే వాళ్ల‌ను ఖాళీచేయించ‌దానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాం. ముంబ‌యి లో వ‌ర్షం వ‌స్తే జ‌నం బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితి ఉంది. చెన్నైలో వ‌ర్షం వ‌స్తే ప‌డ‌వ‌ల్లో తిరుగుతున్నారు. కొల్ క‌త్తాలో శాంతిభ‌ద్ర‌త‌లు లేవు. బెంగ‌ళూరులో ట్రాఫిక్ జాంలు ఉన్నాయి. హైద‌రాబాద్ లో  క‌బ్జాకోరుల ప‌నిప‌డుతున్నాం, ప్ర‌పంచం మ‌న వైపు చూస్తుంది.

బీఆ ర్‌ఎస్ విషం చిమ్ముతోంది : ఉప ముఖ్యమంత్రి భట్టి 

ఓటమి చెంది నిరాశానిస్పృహలకు గురై ఉన్న బీఆర్‌ఎస్ నాయకత్వం  రాష్ట్ర అభివృద్ధిపై విషం చిమ్ముతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం, ప్రపంచంతో పోటీపడటం ఇష్టం లేని కొందరు కుట్రదారులు రాష్ట్రాన్ని శపిస్తున్నారని, వారి కుట్రలను ప్రజలంతా గమనించాలని పిలుపునిచ్చారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎఫ్‌సీడీఏ) భవనం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణను ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని స్పష్టం చేశారు. ’మా అభివృద్ధి ఏదో దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పోటీపడటానికి కాదు.. జపాన్, కొరియా వంటి ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయిలో నిలబెట్టేందుకు పునాదులు వేస్తున్నాం అని చెప్పారు. ఇలాంటి శుభసందర్భంలో కొందరు రాజకీయ స్వార్థంతో ఫ్యూచర్ సిటీ రాకూడదని, అభివృద్ధి జరగకూడదని అడ్డుపడుతున్నారన్నారు. ఈ రాష్ట్రం మనది.. మనమంతా చేయిచేయి కలిపి అడుగులో అడుగు వేసి ముందుకు నడుద్దాం అని ప్రజానీకానికి ఆయన పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం ఈ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కాలుష్యానికి కారణమయ్యే ఫార్మా సిటీని తీసుకువచ్చి హైదరాబాద్ మహానగరాన్ని సైతం ప్రమాదంలోకి నెట్టేసిందని భట్టి విమర్శించారు. ఆనాడు కాంగ్రెస్ పక్షాన ఇచ్చిన మాట ప్రకారమే నేడు కాలుష్య రహిత‘గ్రీన్ ఫార్మా, గ్రీన్ ఎనర్జీ వ్యవస్థలను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుjtస్తున్నట్లు ప్రకటించారు. ఆనాడు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలు ఎలా విలసిల్లాయో రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీ యావత్ తెలంగాణ కీర్తి కిరీటంలో మకుటాయమానమైన మణిహారంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రపంచస్థాయి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని, ఇక్కడి నిరుద్యోగ యువత కోసం స్కిల్స్ యూనివర్సిటీ, అంతర్జాతీయ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి స్థానిక రైతు కుటుంబాలకు పెద్ద ఎత్తున ఆదాయ వనరులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీ పరిధిలో జరుగుతున్న అపూర్వ అభివృద్ధిని చూసి తమ గ్రామాలను కూడా ఈ అథారిటీలో చేర్చాలంటూ స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున దరఖాస్తులు ఇస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. తొలిదశగా కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపడానికి ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా ఉన్నారని చెప్తూ ఈ ప్రాంత ప్రజల విజ్ఞప్తి మేరకు ఆయా గ్రామాలను అథారిటీలో విలీనం చేసే ఫైలుపై ఇదే వేదిక నుంచి సంతకం చేయాaని రేవంత్ రెడ్డిని భట్టి కోరారు.

ఎఫ్‌సీడీఏ పరిధిలోకి పలు గ్రామాలు 

 

ఫ్యూచర్ సిటి పరిధిలోకి కొన్ని గ్రామాలను తీసుకు వచ్చే ఫైలుపై సభా వేదికపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేశారు. కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ఫ్యూచర్ సిటీ పరిధిలోని ప్రాంతాలకు మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి ఎంపికైన కన్సల్టెంట్ సంస్థ ప్రతినిధులకు లెటర్ ఆఫ్ అవార్డును అందించారు. ఎఫ్‌సీడీఏ లోగో, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *