మూసీ రివర్‌‌ఫ్రంట్‌కు కేంద్రం గ్రీన్‌ ‌సిగ్నల్‌

– అనుమతులిస్తూ రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ
– రూ.533.42 కోట్ల విలువైన 83.81 ఎకరాల డిఫెన్స్ ‌భూమి అప్పగింత
– సీఎం రేవంత్‌ ‌రెడ్డి హర్షం
-కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌కు  కృతజ్ఞతలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర ,జూన్‌ 19: ‌రాష్ట్ర‌ ప్రభుత్వం తలపెట్టిన మూసీ రివర్‌‌ఫ్రంట్‌ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. గాంధీ సరోవర్‌ ‌ప్రాజెక్టుఅమలుకు కేంద్రం నుంచి అధికారిక అనుమతి లభించింది. మూసీ రివర్‌‌ఫ్రంట్‌ ‌ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. బాపూఘాట్‌ను ‘గాంధీ సరోవర్‌’‌గా అభివృద్ధి చేయడానికి వర్కింగ్‌ ‌పర్మిషన్‌ను మంజూరు చేసింది. రూ.533.42 కోట్ల విలువైన 83.81 ఎకరాల డిఫెన్స్ ‌భూమి వినియోగానికి అనుమతిచ్చింది. ఆర్టిలరీ సెంటర్‌ ‌గోల్కొండ పరిధిలోని భూమిలో అభివృద్ధి పనులకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చింది. రాష్ట్ర‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్లాగ్‌షిప్‌ ‌ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుండి కీలక అనుమతులు లభించాయి. హైదరాబాద్‌లోని బాపు ఘాట్‌ ‌వద్ద నిర్మించతలపెట్టిన గాంధీ సరోవర్‌ ‌ప్రాజెక్ట్ ‌పనులకు రక్షణ శాఖ గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ కీలకమైన క్లియరెన్స్ ‌లభించడం పట్ల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ ‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో సహకరించి, అనుమతులు మంజూరు చేసినందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌కేంద్ర రక్షణ శాఖ, ఇండియన్‌ ఆర్మీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది పునరుజ్జీవనం , రివర్‌‌ఫ్రంట్‌ అభివృద్ధి విజన్‌లో గాంధీ సరోవర్‌ ‌ప్రాజెక్ట్‌కు అనుమతులు రావడం ఒక కీలక మైలురాయి అని అభివర్ణించారు. బాపు ఘాట్‌ ‌పరిసర ప్రాంతాలలో ఈ ప్రాజెక్ట్ ‌పనులు ప్రారంభం కావడం వల్ల మూసీ పరివాహక ప్రాంత రూపురేఖలు మారిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని కేవలం ఒక నదిలా కాకుండా అద్భుతమైన పర్యావరణ, సాంస్కృతిక‌ , గొప్ప ప్రజా ఆస్తిగా మార్చడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్‌ ‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ ప్రాజెక్టు ‌ద్వారా హైదరాబాద్‌ ‌నగరానికి సరికొత్త పర్యాటక హంగులు తోడవుతాయని, పర్యావరణ రక్షణకు కూడా ఇది ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర రక్షణ శాఖ ఇచ్చిన ఈ గ్రీన్‌ ‌సిగ్నల్‌తో గాంధీ సరోవర్‌ ‌ప్రాజెక్టు ‌పనులు మరింత వేగంగా ముందుకు సాగనున్నాయి. మూసీ పునరుజ్జీవం, రివర్‌ ‌ఫ్రంట్‌ అభివృద్ధి విజన్‌లో ఇదో మైలురాయన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని పర్యావరణ, సాంస్కృతిక‌, ప్రజా ఆస్తిగా మార్చడమే లక్ష్యమని రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *